రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అమరావతికి అంకురార్పణ చేసింది. అందుకు అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా ఓకే చెప్పింది. కానీ... 2019లో అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా యూ టర్న్ తీసుకుని మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. దీంతో... అప్పటికే ప్రారంభమైన అమరావతి నిర్మాణ పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కట్ చేస్తే... ఐదేళ్ళ తర్వాత సీన్ తిరగబడింది.
తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు ఆ లేఖ చుట్టే తిరుగుతోంది. తన తండ్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కి ఎమ్మెల్సీ కవిత రాసిన లెటర్... ఇటు పార్టీలో, అటు బయట కూడా పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది. ఒక పార్టీనేత మరో పార్టీకి లెటర్ రాయడం సాధారణం. కానీ.... ఒకే పార్టీలో ఉండి రాస్తే... దాన్ని ధిక్కారంగానే భావిస్తారు. ఇలాంటి వాతావరణంలో... తండ్రీ కూతుళ్ళ బంధాన్ని పక్కనపెడితే...ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధ్యక్షుడికి రాసిన లేఖ మాత్రం ఉన్నట్టుండి పొలిటికల్ హీట్…
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు కీలకం. గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం మొత్తం వన్ సైడ్‌గా కూటమికి పట్టం కట్టింది.. ఫలితాలలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. రెండు జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.. గత ఎన్నికల్లో టిడిపి 22, జనసేన 11 స్థానాల్లో, బిజెపి ఒక చోట పోటీ చేసి గెలిచాయి. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 21 సీట్లలో పోటీ చేస్తే అందులో 11 ఉమ్మడి ఉభయ గోదావరి…
ఇదే... ఈ గొడవే... ఇప్పుడు వైసీపీలో రకరకాల చర్చలు, కొత్త రకం ప్రశ్నలకు కారణం అవుతోందట. మాజీ మంత్రి విడదల రజిని, సీఐ సుబ్బారాయుడు మధ్య వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుని రచ్చ అయిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ కుటుంబంలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని, ఇక నుంచి ఆ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చంటూ కొద్ది రోజులుగా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ఒకరు, శాసనసభాపక్షం చీలిపోతుందని మరొకరు మాట్లాడుతున్నారు. దీంతో... బీఆర్ఎస్ కేడర్‌లో ఏదో తెలీని ఆందోళన, అంతకు మించిన గందరగోళం. అదే సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ సైతం నడుస్తోంది.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ స్పీడ్ పాలిటిక్స్ చేసినట్టు చెప్పుకుంటారు. ఆయన నోటికి కూడా హద్దూ అదుపూ ఉండేది కాదన్నది రాజకీయవర్గాల్లో విస్తృతాభిప్రాయం. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా తగ్గేదే లేదన్నట్టు చెలరేగిపోయేవారు. అబ్బే.... వాళ్ళకంత సీన్ లేదు, ఇంత సినిమా లేదంటూ మీసాలు మెలేసి సవాళ్ళు విసిరేవారాయన. కట్ చేస్తే.... రాష్ట్రంలో ప్రభుత్వం మారాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే.
ఎక్కడ తప్పు జరిగిందో అక్కడే సరిదిద్దుకోవాలి. పడ్డ చోటే లేచి నిలబడాలి. ప్రస్తుతం ఈ మాటలు వైసీపీకి చాలా ముఖ్యం అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఓటమి తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు బాగా దిగజారిపోతున్నాయి. కొన్ని చోట్ల నాయకుడే లేకుండా పోతుంటే.... అక్కడే టీడీపీ ఇంకా బలపడుతున్న పరిస్థితి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఉందట. ఇప్పుడిక్కడ పార్టీకి నాయకుడెవరో తెలియడం లేదు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చి.. ఒక…
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటోంది. రకరకాల గొడవలు, ఆరోపణలతో పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గతంలో ఇక్కడ ముఠా కక్షలు, రాజకీయ ఘర్షణలు చాలా కామన్‌గా ఉండేవి. అదంతా వేరే సంగతి. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన, పూర్తి నేలబారు వ్యవహారాలు నడుస్తున్నాయన్న టాక్ ఉంది నియోజకవర్గంలో. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులపై నిత్యం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బండారు సత్యానందరావు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట టీడీపీ ఎమ్మెల్యే. ఇన్నాళ్ళు సౌమ్యుడిగా పేరున్న బండారు తీరు ఈసారి మారిందన్న టాక్ బలంగా నడుస్తోంది నియోజకవర్గంలో. ఇప్పుడాయన ఏకంగా నాలుగు ముక్కలాట ఆడుతున్నారట. కూటమిలోని మూడు పార్టీల నాయకులను పక్కనపెట్టి... వైసీపీ వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారన్నది ఇప్పుడు కొత్తపేటలో హాట్ సబ్జెక్ట్. అధికారంలోకి వచ్చిన నాటినుండి చాటుమాటుగా కొనసాగుతున్న చెలిమి ఇటీవల ఆయన పుట్టిన రోజు వేడుకల్లో బయటపడిందట.
తెలంగాణ కాంగ్రెస్‌లో కమిటీల ఏర్పాటు వ్యవహారం ఎలా ఉందంటే.. వస్తా కూర్చో అని చెప్పి వెళ్ళిపోయినట్టు ఉందంటున్నారు. వెళ్ళిన వాడు తిరిగి రాడు.. కూర్చున్నోడు వెళ్లిపోలేడు. అదిగో ఇదిగో అనడం ఒక ఎత్తైతే.. ఒకరి మీద ఒకరు పితూరీలు చెప్పుకుంటూ.. కొర్రీలు పెట్టుకుంటున్నారట.