ప్రస్తుతం దూరంగా ఉంటూనే అక్కడి వ్యవహారాలను చక్కబెడుతున్నారో మంత్రి. ఆయన అడుగుపెడితే మాత్రం ఆరడుగుల వ్యూహం తప్పదనే టాక్ ఉంది. అందుకే ఉపఎన్నిక జరిగే నియోజకవర్గంలో ఆ మంత్రి ఎంట్రీ ఎప్పుడన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆయనెవరో ఈస్టోరీలో చూద్దాం. హుజురాబాద్‌లో వేగంగా పావులు కదుపుతోన్న టీఆర్ఎస్ హుజురాబాద్ ఉపఎన్నికపై టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో ఎన్నో ఉపఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం ఉన్న గులాబీపార్టీ.. ఈ ఉపపోరును మాత్రం సీరియస్‌గా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని…
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఆ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారట. ఇంకొకరు మధ్యలో దూరకుండా వారసులను లైన్లో పెట్టేందుకు ముందుగానే కర్చీఫ్ వేస్తున్నారు. అదను చూసి పావులు కదుపుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. కుమారులను ప్రోత్సహిస్తోన్న ఎమ్మెల్యేలు! కర్నూలు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల కంటే వారి వారసులు రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు.…
కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారా? కర్టసీ కోసం టచ్‌లోకి వెళ్తున్నారా.. లేదంటే ముందే కర్చీఫ్ వేసుకుంటున్నారా? అప్పట్లో కాదని వెళ్లిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వెనక్కి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? లెట్స్ వాచ్! పార్టీ మారిన ఎమ్మెల్యేలు టచ్‌లోకి వస్తున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ సింబల్ మీద గెలిచి.. ప్లేట్ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై.. కొత్త పీసీసీ చీఫ్ వచ్చి రాగానే మాటల తూటాలు పెంచారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు.. కౌంటర్ అటాక్ చేసినా……
నిప్పు లేనిదే పొగ రాదు. ఆ ప్రాంతంలో మంత్రి తీరుపై ఎమ్మెల్యేల గుస్సా కూడా అలాగే ఉందట. వారికి తెలియకుండా నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారట ఆ మంత్రిగారు. ఇంకేముందీ నిన్న మొన్నటి వరకు సఖ్యంగా ఉన్న ఎమ్మెల్యేలు నారాజ్ అవుతున్నారట. అమాత్యుల వారిని కట్టడి చేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి మల్లన్న తీరుపై ఎమ్మెల్యేలు గుర్రు! టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పరిస్థితులలో ఎమ్మెల్యేగా పోటీ చేసి మేడ్చల్‌లో…
ఒకరు కాదు.. ఇద్దరు కాదు… ఇప్పటికి ఐదుగురు కలెక్టర్లను బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ జాబితాలో ఇంకెంత మంది చేరతారో ఏమో? ప్రస్తుతం తెలంగాణ IAS వర్గాల్లో ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. ఎందుకు బదిలీ చేశారు? ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదన్నదే అధికారుల్లో చర్చగా మారింది. ఇంతకీ IASలను బదిలీ చేసి ఎందుకు పోస్టింగ్‌లు ఇవ్వడం లేదు? లెట్స్ వాచ్! గత ఏడాది నవంబర్ నుంచి ఐదుగురు కలెక్టర్లు బదిలీ.. నో పోస్టింగ్! IAS అంటే…
దేవుడి సన్నిధిలో ఆరేళ్లపాటు ఆయనే సర్వాధికారి. ప్రభుత్వ పెద్దలతో స్నేహాలు.. రాజకీయ నాయకులతో పరిచయాలు.. చేతిలో అధికారం.. డోంట్ కేర్ అనే తత్వం. ఇంకే ముంది.. అంతా తానై చక్రం తిప్పారు. కాలం మారింది. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఇంతకీ అంతా ఆయనే చేశారా? ఆయన వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఈ తవ్వకాలన్నీ ఆ అదృశ్య శక్తి కోసమేనా? సింహాచలం భూముల రగడలో ప్రభుత్వ యాక్షన్ ఏంటి? సింహాచలం భూముల వ్యవహారం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.…
నామినేటెడ్ పదవుల భర్తీలో అన్యాయం జరిగిందని వాపోతున్నారు కర్నూలు వైసీపీ సీనియర్లు. ఎమ్మెల్యేలు సిఫారసు చేశారు ఇక తిరుగే ఉండదు అనుకున్న నేతలకు తాజా పదవుల పంపకాల్లో నిరాశే మిగిలింది. స్థానికంగా సీనియర్లు అనిపించుకున్న నేతలనూ హైకమాండ్ పక్కన పెట్టేయడం ఏ లెక్కలోనో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చినా పదవుల్లేవ్! కర్నూలు జిల్లాలో వైసీపీ సీనియర్లు.. నాయకులకు కొదవ లేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సాన్నిహిత్యం ఉండి.. వైసీపీ ఆవిర్భావం నుంచి జెండా…
హుజురాబాద్‌లో హత్యా రాజకీయాలు వర్కవుట్ అవుతాయా? ఉపఎన్నికను చావో రేవోగా భావిస్తూ.. తాజాగా చేసిన కామెంట్స్ ఈటలకు కలిసి వస్తాయా? ప్రత్యర్ధి పార్టీలు వేసే ఎత్తుగడలతో ఈటలకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? హుజురాబాద్‌లో మారుతున్న వ్యూహాలు ఉపఎన్నికల షెడ్యుల్ విడుదల కంటే ముందే హుజురాబాద్‌లో సందడి మొదలైంది. రాజకీయ పార్టీలు ప్రచార హోరును పెంచుకుంటూ పోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు హుజురాబాద్ ఉపఎన్నికపైనే ఉంది. అక్కడ రాజకీయ పార్టీల నాయకులు చేసే ప్రకటనలు సర్వత్రా…
పార్లమెంట్ సమావేశాల మాటున ఢిల్లీలో ఆ ఎంపీ సొంత కార్యాలు చక్కబెట్టుకుంటున్నారా? ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అతను.. ఇప్పుడెందుకు పావులు కదుపుతున్నారు? మనసు మార్చుకున్నారా? మార్పు వెనక కథేంటి? ఎవరా ఎంపీ? ఈటల వ్యాపార భాగస్వామి కావడంతో భేటీకి ప్రాధాన్యం! ప్రధాని మోడీ మంత్రివర్గంలో ఇటీవల కేబినెట్ మినిస్టర్‌గా ప్రమోషన్ పొందిన కిషన్‌రెడ్డిని.. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కలిసి మాట్లాడారు. ఒకే రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్నందున కలిశారులే అని కొట్టి పారేయడానికి ఈ భేటీ లేదన్నది…
రెండేళ్లుగా గ్రూపు రాజకీయాలతో తలబొప్పి కొట్టిన ఆ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్ పట్టుకుందా? ఎంపీతో ఎడముఖం.. పెడముఖంగా ఉంటున్నారా? ఎంపీ వస్తున్నారని తెలిస్తే.. వేరే పని ఉందని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోతున్నారా? ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలకు ఏ విషయంలో బెడిసికొట్టింది. ఎవరు వారు? కేడర్‌తో ఎమ్మెల్యే కిరణ్‌కు దూరం వచ్చిందా? శ్రీకాకుళం ముఖ ద్వారం ఎచ్చెర్ల పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటాయి. నేను లోకల్ అంటూ గత ఎన్నికల్లో బరిలో దిగిన గొర్ల…