కొత్తగా వచ్చిన పథకాలు చేతినిండా వారికి పని కల్పిస్తున్నాయి. కానీ.. వైరిపక్షం చేసే విమర్శలకే కౌంటర్లు ఇవ్వడం లేదట. కొందరే స్పందిస్తున్నారట. మిగతా వారి సంగతేంటో తెలియడం లేదు. వాళ్లది మౌనమా.. వ్యూహమా కూడా అర్థం కావడం లేదట. టీఆర్ఎస్లో ప్రస్తుతం ఈ చర్చే సాగుతోంది. ప్రవీణ్‌కుమార్ విమర్శలకు కొందరే కౌంటర్ ఇచ్చారా? తెలంగాణలో కొత్తగా రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ పొలిటికల్ కలర్స్ మారుతున్నాయి. మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్…
పీసీసీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు రేవంత్. ఈ సమయంలో ఆయనకు అసమ్మతి దెబ్బలు గట్టిగానే తగుతున్నాయట. సీనియర్ల సహాయ నిరాకరణతో సభా వేదికలను మార్చుకోక తప్పడం లేదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ఇదే హాట్ టాపిక్. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రేవంత్‌కు అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోందా? తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్కఅన్నట్టుగా వెళ్తున్నారు పీసీసీ చీఫ్. ఈ క్రమంలోనే పార్టీలో సభలు.. సమావేశాల ప్రకటనలపై వివాదాలు…
అధికారపార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే సడెన్‌గా దూకుడు పెంచారా? మాటల తూటాల వెనక మర్మం ఏంటి? గతంలో తనపై జరిగిన ప్రచారం మళ్లీ ఎదురు కాకుండా జాగ్రత్త పడుతున్నారా? ఇంతకీ ఆయనది యాక్షనా.. రియాక్షనా? ఎవరా ఎమ్మెల్యే? మల్కాజ్‌గిరిలో మైనంపల్లి వర్సెస్ బీజేపీ! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరి ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ రణ క్షేత్రంగా మారిపోయింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా టిఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. అది రెండోరోజూ కంటిన్యూ…
ఆయన విపక్షంలో ఉన్నప్పుడు మాటలు తూటాల్లా పేలేవి. ఇప్పుడు అధికారపక్షంలో ఉన్నారు. ఉలుకు లేదు.. పలుకు లేదు. అంతా బీ.. కామ్. అనుచరులకు కూడా తమ నేతలో వచ్చిన మార్పు అర్థం కావడంలేదట. ఆయనకేమైంది? ఎవరా నాయకుడు? ఏమా కథ? కీలక అంశాలపై పెదవి విప్పని చెవిరెడ్డి! వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోందట. విపక్షపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ప్రతి అంశంలోనూ దూకుడు ప్రదర్శించిన ఆ చెవిరెడ్డి..…
ఇంద్రవెల్లి సభ తర్వాత కాంగ్రెస్ ఆలోచన మారిందా? పార్టీతో కలిసి ప్రయాణం చేయకపోతే.. కాంగ్రెస్‌లో ఉన్నా లేకపోయినా ఒకటే అన్న సంకేతాలు పంపుతోందా? మారిన వైఖరిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంద్రవెల్లి సభకు రాని నేతలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. సీనియర్ నాయకులకు కేరాఫ్ అడ్రస్. అలాంటిది పదేళ్ల కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. ముఖ్యులు అనుకున్నవారు తమకు భవిష్యత్ బాగుంటుంది అనుకున్న…
తెలుగు రాష్ట్రాల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఇప్పటి నుంచే వేట మొదలుపెట్టిందా? ప్రధాని మోడీ నేరుగా రంగంలోకి దిగారా? క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్నారా? బీజేపీవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? నేతల ఆలోచనలు ఎలా ఉన్నాయి? సర్వే పేరుతో నేరుగా రంగంలోకి మోడీ! ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి చివరిక్షణాల్లో పార్టీల వడపోతలు కామన్. మొన్నటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణాల్లో బీజేపీ చేసింది కూడా ఇదే. ఇప్పుడు మాత్రం బీజేపీ…
అక్కడి అధికారపార్టీలో ముసలం పుట్టింది. ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. నియోజకవర్గంలో పట్టుకోసం ఒకరు.. పట్టుసడలకుండా మరొకరు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. వారెవరో.. ఏం చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం టికెట్ కోసం ఇప్పటి నుంచే ఎత్తుగడలు! గద్వాల. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నడిగడ్డగా పిలవబడే ప్రాంతం. అక్కడి రాజకీయం ఓ పట్టాన అంతుబట్టదు. రాష్ట్ర రాజకీయం అంతా ఒకలా ఉంటే గద్వాల పాలిటిక్స్ మరోలా ఉంటాయి. ఏదో ఒక రాజకీయ రగడ కామన్.…
ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడై ఏడాదే అయ్యింది. అప్పుడే ఆయన వెనక గోతులు తవ్వుతున్నారా? ఆ గోతుల వెనక ఒకనాటి మిత్రపక్షం ఉందని అనుమానిస్తున్నారా? పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? ఏంటా పార్టీ? ఎవరా నాయకుడు? సోమును తొలగించి కన్నాకు పగ్గాలు ఇస్తారని ప్రచారం! సోము వీర్రాజు. ఏపీ బీజేపీకి అధ్యక్షుడై ఏడాది అయ్యింది. ఈ సంవత్సర కాలంలో ఆలయాలపై దాడులు.. అంతర్వేది, దుర్గగుడి రథాలపై ఉద్యమాలు చేశారు. మధ్యలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికనూ ఎదుర్కొన్నారు. కోవిడ్ వల్ల…
ఆయన ఎమ్మెల్సీ అయ్యారా.. లేదా? టీఆర్ఎస్తోపాటు రాజకీయావర్గాల్లో ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నా.. ఇంత వరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో ఆ ఫైల్ ఆగిందా లేక ఆపారా అన్న చర్చ జోరందుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్! ఆగస్టు ఒకటో తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి కొద్దిరోజుల ముందే టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్…
పైన పటారం.. లోన లోటారం. తెలంగాణ బీజేపీలో ఇదే పరిస్థితి ఉందట. ఉన్న కొద్దిమంది నేతలూ ఒక్కమాట మీద లేరట. ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుడొకరు ఆ సమస్యకే మందు పూసి వెళ్లారట. కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నట్టు టాక్. మరి.. ఆయన మాటలు కమలనాథుల చెవికి ఎక్కాయా? పార్టీ నేతల మధ్య ఉన్న ఇబ్బందేంటి? బీజేపీలో ముఖ్యనేతల మధ్య గ్యాప్ ఉందా? శరీరానికి దెబ్బ తగిలితే మందు రాస్తారు. చికిత్స చేస్తారు. అదే మనసుకు గాయమైతే..? కోలుకోవడానికి…