అధికార పార్టీలోకి వెళ్లితే ఐదేళ్లు ఢోకా ఉండదని ఎన్నో లెక్కలు వేసుకున్నారు ఆ ఎమ్మెల్యే. కేబినెట్లో చోటు దక్కుతుందని గంపెడాశలతో ఉన్నారు. ఇంతలో మారిన రాజకీయ పరిణామాలతో ఆయనకు నిద్రకరువైందట. ఉన్న పార్టీలోని కేడర్ ఎమ్మెల్యేను ఓన్ చేసుకోవడం లేదట. ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్లేమో కత్తులు నూరుతున్నారు. ఇప్పుడు వాళ్లూ..వీళ్లూ కలిసిపోవడంతో కంగారెత్తిపోతున్నారట ఆ ఎమ్మెల్యే. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. గండ్ర లక్ష్యంగా భూపాలపల్లిలో రాజకీయ వేడి! శత్రువుకు శత్రువు మిత్రుడు. భూపాలపల్లిలో రాజకీయం…
ఫలితం అనుకూలంగా ఉంటే అంతా మా కృషే అని చంకలు గుద్దుకుంటారు. తేడా కొడుతుందని అనుమానం వస్తే మాత్రం దూరం జరుగుతారు. హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలోనూ ఆ పార్టీలో అదే జరుగుతోందట. టచ్‌మీ నాట్ అన్నట్టు ఉంటున్నారట నాయకులు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. హుజురాబాద్‌పై చర్చకు ఇష్టపడని కాంగ్రెస్ నేతలు! తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఎదో ఒక పంచాయితీ ఉంటూనే ఉంటుంది. సభలు సమావేశాలపై తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? మీరు అలా ఎలా…
CPI నారాయణ స్టయిలే వేరు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో.. ఎవరి మీద విరుచుకుపడతారో ఎవరికీ అర్థం కాదు. అలాంటి నారాయణకు ఒక్కటే కోరిక మిగిలిపోయిందట. ఇప్పటికీ అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈసారి మాత్రం గట్టిప్లాన్తో వర్కవుట్ చేయాలని అనుకుంటున్నారట ఆ కామ్రేడ్. అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయాలని కలలు! సీపీఐ నారాయణ ఏం చేసినా సంచలనమే. ఆయన చేసిన పనులు క్షణాల్లో వైరల్ అవుతాయి. తాజా రాజకీయ పరిణామాలపై స్పందిస్తు మెయిన్ స్ట్రీమ్‌లో…
ఒక్క ఉపఎన్నిక.. అక్కడి ఉమ్మడి జిల్లాలోని అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోందా? కలెక్టర్ నుంచి సీపీ వరకు ఆకస్మిక బదిలీల వెనక కారణాలు అవేనా? సీనియర్ ఐపీఎస్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడాన్ని ఎలా చూడాలి? ఉద్యోగ, రాజకీయవర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! కరీంనగర్ సీపీ బదిలీపై రాజకీయ వర్గాల్లో చర్చ! తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక రాజకీయపార్టీల్లో సెగలు రేపుతుంటే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ అధికారుల కుర్చీలు కదిలిస్తోంది. కలెక్టర్లు.. ఐపీఎస్‌లను ఉన్నపళంగా బదిలీ…
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడ్డారా? షెడ్యూల్, నాన్ షెడ్యూల్ వివాదంలో ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నారా? మనసులో ఒకటి పెట్టుకుని.. బయటకు మరోమాట మాట్లాడుతున్నారా? ఇంతకూ ఎవరా ఎమ్మెల్యేలు? ఆ తగువు వెనక అసలు కథేంటి? విశాఖ ఏజెన్సీలో షెడ్యూల్, నాన్ షెడ్యూల్‌పై చర్చ విశాఖ ఏజెన్సీలో షెడ్యూల్, నాన్ షెడ్యూల్ అంశం మళ్లీ వేడెక్కడంతో మాడుగుల, చోడవరం, నర్సీపట్నం ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడుతున్నారని టాక్. 9 మండలాల పరిధిలో ఉన్న 163 రెవెన్యూ గ్రామాల్లో 80…
వీళ్లు అనుమానిస్తున్నదే అక్కడ జరిగిందా? తీగ లాగితే డొంక బయట పడుతుందనే భయం మొదలైందా? అందుకే తెర వెనక ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఇది వారి ఆలోచనా.. లేక వారి వెనకున్న వారి ఆలోచనా? తప్పించుకునేందుకు ఆదిలోనే తోవలు వెతుకుతున్నారా? నిధుల గోల్మాల్ వెనకున్న పెద్దలు బయటకొస్తారనే ‘రాజీ’ ప్రయత్నాలు? జగన్ ప్రభుత్వం నాటి టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలు తవ్వే పని నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఒకటొకటిగా దర్యాప్తు చేయడం.. కేసులు నమోదు కావడం చకచకా జరిగిపోతున్నాయి.…
ఆయన మనసు మార్చుకున్నారా? కాషాయ జెండానే తన అజెండా అని చెబుతూ దూకుడు ప్రదర్శించి.. ఇంతలోనే మారు మనసు పొందారా? సొంత పార్టీతో రాజీపడ్డారా లేక.. అప్పుడే తొందరపడటం ఎందుకునుకున్నారా? ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఆయన ఒక్కసారిగా ఎందుకు పురివిప్పారు? దారిలోకి వస్తున్నారని అనుకుంటున్న సమయంలో మరో బాంబ్ పేల్చారు? ఇది వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా? రాజగోపాల్‌రెడ్డి యాక్టివ్ అయ్యారా? రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చేసినా హల్చలే. నల్గొండ పాలిటిక్స్‌లో సోదరుల రూటు సెపరేట్. గడిచిన…
తాడిపత్రి రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కూల్చివేతలు.. మాటల తూటాల వెనక పొలిటికల్ పన్నాగం ఇంకేదో ఉందనే చర్చ జరుగుతోంది. మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నారనే అనుమానం ఒకరిది. రూల్ పాటించకపోతే ఎలా అని చట్టానికి పదును పెడుతున్నారు ఇంకొకరు. దీంతో ఆదిపత్యపోరులో ఎవరు పైచెయ్యి సాధిస్తారనే ఉత్కంఠ పెరుగుతోంది. ఆక్రమణల కూల్చివేతలతో రాజకీయ వేడి! ఏపీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రిలో మాత్రమే టీడీపీ పాగా వేసింది. జేసీ బద్రర్స్ ఎత్తుగడలే దానికి కారణం. సింపుల్ మార్జిన్‌తో…
ఇతర పార్టీల నుంచి ఎవరైనా వలస వస్తే.. వారి స్థాయిని భట్టి గౌరవం ఇస్తాయి చేర్చుకున్న పార్టీలు. అక్కడ మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తారు నాయకులు. కానీ.. తెలంగాణ బీజేపీలో చేరిన మాజీ ప్రజాప్రతినిధులకు సీన్ రివర్స్‌లో ఉందట. మెడలో కండువా తప్ప చేతుల్లో పార్టీ పదవి ఒక్కటీ లేదు. బీజేపీ నుంచి ఒక్కో వికెట్ పడిపోతున్న సమయంలో వలస నేతలపట్ల కాషాయ శిబిరం ఆలోచన శ్రేణులను కలవర పెడుతోందట. మీటింగ్‌కు వస్తే స్టేజ్‌పై నో కుర్చీ!…
ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే. నాలుగుసార్లు గెలిచినా ఎక్కడా వివాదాస్పదం కాలేదు. తాను అనుకున్నది అనుకున్నట్టు చేయడం అలవాటైన ఆ ఎమ్మెల్యే.. ఇప్పుడు అత్యంత వివాదంలో చిక్కుకున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ కామెంట్స్ చేశారు. ఏకంగా బీజేపీకి, హిందుత్వ వాదులకు టార్గెట్ అయ్యారు. read also : హుజురాబాద్‌లో హరీష్ అడుగుపెడితే ఉత్కంఠ తప్పదా? ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి లౌక్యం తెలియదా? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జిల్లాలో మినహా రాష్ట్రంలో తెలిసిన వారు తక్కువ. 175…