తెలంగాణ బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారా? తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కీలకంగా మారిన గెజిటే దానికి కారణమా? ఏపీ బీజేపీ నేతల పాటనే తెలంగాణ కమలనాథులు పాడుతున్నారా? ఈ యుగళగీతం వెనక ఆంతర్యం ఏంటి? ఇది నష్టమా.. లాభమా? గెజిట్‌పై తెలంగాణ బీజేపీ స్పందించిన తీరు మీద చర్చ! కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు స్పందించాయి.…
రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు శత్రువులుగా మారతారో చెప్పలేం. ఆ నియోజకవర్గంలో కూడా అంతే. నిన్న మొన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అనుకున్నవారు నేడు ముఖం చిట్లించే పరిస్థితి. కొత్త మిత్రుడు దొరకడంతో పాత ఫ్రెండ్‌కు గుడ్‌బై చెప్పేశారట. అదే ఇప్పుడు అధికారపార్టీలో హాట్ టాపిక్. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం. మాజీ ఎంపీ అనుచరుడిగా ఎమ్మెల్యేపై ముద్ర! ఖమ్మం జిల్లా వైరా. 2018 ఎన్నికల్లో ఇక్కడి ఫలితం ఓ సంచలనం. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో…
ఇద్దరూ మంత్రి అనుచరులే. హోదాకు తగ్గ పదవుల్లోనే ఉన్నారు. కానీ.. ఆధిపత్యపోరు వారిని కుదురుగా ఉండనివ్వడం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వైరం వచ్చేసింది. ఎవరికి నచ్చజెప్పాలో.. ఇంకెవరిని బుజ్జగించాలో తెలియక తలపట్టుకుంటున్నారట ఆ అమాత్యుడు. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం. పదవులు చేపట్టిన నాలుగు నెలలకే గొడవలు ఈమె ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ గంగాడ సుజాత. ఈయన డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ. ఇద్దరూ అధికారపార్టీలోనే ఉన్నారు. పైగా మంత్రి బాలినేని…
కాంగ్రెస్‌లో అంతే…! ఆ పార్టీలో ఇది రొటీన్ డైలాగ్. కొత్త పీసీసీ చీఫ్ వచ్చాక దానికి బ్రేక్ పడుతుందని అనుకున్నారట. కానీ.. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అని నిరూపిస్తున్నారు నాయకులు. ఆ అంశంపైనే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రేవంత్‌పై మొదలైన ఫిర్యాదుల పర్వం! తెలంగాణ కాంగ్రెస్‌లో కయ్యాలు కామన్. ఏ చిన అంశం తెర మీదకు వచ్చినా.. అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్తాయి. కొత్త పీసీసీ చీఫ్…
ముల్లును ముల్లుతోనే తీయాలని చూస్తున్నారు ఆ నాయకుడు. ఇప్పటికీ వెంటాడుతున్న సమస్య తన రాజకీయ భవిష్యత్‌కు అడ్డుపడకూడదని రివర్స్ ప్లాన్ వేశారట. తనకు వ్యతిరేకమని ప్రచారం జరుగుతున్న వర్గంతోనే ఘన సన్మానం చేయించుకుని శత్రు శిబిరానికి షాక్ ఇచ్చారట. ఇంతకీ ఇవన్నీ వర్కవుట్ అవుతాయా? కేసు విచారణలో ఉండగానే ఎమ్మెల్యేగా గెలిచారు.. ఇప్పుడు ఎమ్మెల్సీ! తోట త్రిమూర్తులను శిరోముండనం కేసు నీడలా వెంటాడుతోంది. తాజాగా ఎమ్మెల్సీ అయినా ఆయన్ను శిరోముండనం కేసుకు బాధ్యుడిగా చేస్తూ బర్తరఫ్ చేయాలని…
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అందరినీ కలుపుకొని పోకుండా.. సొంత కోటరీని ప్రమోట్ చేసుకుంటున్నారట. ఇంకేముందీ ఎమ్మెల్యేపై భగ్గుమనేవాళ్ల సంఖ్య పెరిగింది. వర్గాలు పుట్టుకొచ్చాయి. ఎవరి కుంపటి వారిదే. ప్రస్తుతం మూడు గ్రూపులు.. ఆరు తగాదాలుగా ఉందట అక్కడి టీఆర్ఎస్ పరిస్థితి. ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. మదన్‌రెడ్డికి బంధువులతో పొసగడం లేదా? మదన్‌రెడ్డి. మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఉన్న ఆధిపత్య పోరు కారణంగా.. సొంత పార్టీ నేతలే ఆయనపై ఒంటికాలిపై…
చిత్తశుద్ధి లేని శివపూజలా ఉందట.. తెలంగాణలో ఉద్యోగ ఖాళీల గుర్తింపు. నెలల తరబడి కసరత్తు చేశామని చెబుతూ.. అధికారులు ఇచ్చిన జాబితాపై సీఎం సంతృప్తి చెందలేదు. వారికి మరో డెడ్‌లైన్ పెట్టారు. అసలు ఆఫీసర్లు వాస్తవ లెక్కలే ఇచ్చారా? లేక తిమ్మిని బమ్మిని చేయాలని చూశారా? ఉద్యోగ ఖాళీల లెక్కలను అధికారులు సరిచూసుకున్నారు గత డిసెంబర్లోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. వెంటనే ఖాళీలను గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టాలని…
అన్న ఎమ్మెల్యే.. పెత్తనం తమ్ముడిది. అక్కడ ఎవరికైనా సరే.. తమ్ముడి మాటే వేదం. దీంతో తమ్ముడి కుమ్ముడి గురించి కథలు కథలుగా చెప్పుకొంటున్నారు జనం. ఇదే ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం. నందిగామలో ఎమ్మెల్యే తమ్ముడి తీరుపై చర్చ! 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ ఖాతాలో పడిన నియోజకవర్గాల్లో కృష్ణాజిల్లా నందిగామ ఒకటి. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఓడిన మొండితోక జగన్మోహనే 2019లో గెలిచి అసెంబ్లీలో…
సైకిల్ దిగి కారెక్కిన ఎల్ రమణ లోడ్ ఎత్తాలా? ఆయనకు ఎలాంటి పదవీ యోగం ఉంది? ఈటల ఎగ్జిట్ తర్వాత రమణకు రెడ్‌కార్పెట్ పరిచిన టీఆర్ఎస్.. కేబినెట్లోకి తీసుకుంటుందా? ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆయనకు ఇచ్చిన మాటేంటి? ఈటల ఎపిసోడ్ తర్వాత పెరిగిన ప్రాధాన్యం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉంటూ.. ఆ పదవికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్లో చేరిన ఎల్ రమణకు అధికారపార్టీలో లభించే ప్రాధాన్యం ఏంటి? మారిన రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఆయనకు కలిసి…
రాజకీయాలను వదిలేసి.. వచ్చిన దారినే వెళ్లిపోదామని అనుకున్నారు. ఇంతలోనే పెద్ద పదవి వరించింది. ఆ సంతోష సమయంలోనే కాలాంతకుల చేతికి చిక్కారు. పోలీసులూ చుక్కలు చూపిస్తున్నారట. ఏం జరుగుతుందో తెలియక తలపట్టుకున్నారు ఆ ప్రజాప్రతినిధి. వైసీపీలో చర్చగా మారిన ఆ నాయకుడెవరో ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్సీ అయిన సంతోషం ఆవిరి.. వరస కష్టాలు! ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఆర్.రమేష్ యాదవ్‌కు వరస కష్టాలు కలవర పెడుతున్నాయి. ప్రొద్దటూరు…