తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దివంగత సీఎం వైఎస్ఆర్ను ఓన్ చేసుకున్నారా.. లేదా? పన్నెండేళ్ల తర్వాత మొదలైన ఈ చర్చలో కాంగ్రెస్ వర్గాల్లో భిన్న వాదనలు ఉన్నాయా? ఇంతకీ YSR ఎవరి మనిషి? ఇప్పుడెందుకీ రచ్చ! వైఎస్ సంస్మరణ సభతో దివంగత సీఎం ఇమేజ్‌పై చర్చ! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను శాసించిన వ్యక్తి దివగంత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆయన ఇమేజ్ను క్యాష్ చేసుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏపీలో ఈ అంశంపై రగడ లేకపోయినా.. తెలంగాణలోనే…
కుప్పం టార్గెట్‌గా అధికారపార్టీ వేగంగా పావుల్ని కదుపుతోంది. మేము ఏమైనా తక్కువా అన్నట్టు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోందట టీడీపీ. కుప్పం మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మేము పుంగనూరు సంగతి చూస్తాం అంటున్నారట అక్కడి తెలుగు తమ్ముళ్లు. నిస్తేజంగా ఉన్న పాత ఇంఛార్జ్‌ను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చి పెద్దిరెడ్డి పెద్దరికానికి చెక్ పెట్టాలని చూస్తున్నారట. పుంగనూరుపై టీడీపీ ఫోకస్ పెట్టిందా? చిత్తూరు జిల్లా ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకమైంది. మాజీ సీఎం చంద్రబాబు సొంత…
కష్టపడ్డారు. అబ్బాయికి అండగా నిలబడ్డారు. అధికారంలోకి వస్తున్న సమయంలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈసారైనా లైన్లోకి రావాలనుకున్నా అధినేత అవకాశం ఇవ్వలేదు. దీంతో రూటు మార్చారు. అడగకుండానే వచ్చిన స్వామి కార్యానికి న్యాయం చేస్తూనే.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ స్వకార్యాన్నీ నెరవేర్చుకుంటున్నారట. ఎవరాయన? ఏమా కథ..చూద్దామా..! స్వామి కార్యం.. స్వకార్యంలో వైవీ! TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రూట్ మార్చారు. మొదటి విడతలో ఓన్లీ TTD మీదే దృష్టి పెట్టిన YV రెండోదఫా ప్రత్యక్ష…
మాజీ మంత్రి కుమారుడు ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఓడాక.. పార్టీని, కేడర్‌ను ఆయన పట్టించుకోవడం లేదట. పైగా అధికారపక్షానికి దగ్గరవుతున్నారని గుర్రుగా ఉన్నారట తెలుగు తమ్ముళ్లు. ఇంకేముందీ.. ఆయన్ని పక్కన పెట్టేయాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఓటమి తర్వాత హరికృష్ణ కనిపించలేదని కేడర్ ఆరోపణ! చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నాయకత్వ లేమి కారణంగా ఇక్కడ పార్టీకి ఓటమి…
ఆహ్వానాలు వెళ్లాయి సరే..! సెప్టెంబర్ 2నాటి YSR సంస్మరణ సభకు తెలంగాణ నుంచి హాజరయ్యేది ఎవరు? ఎంత మంది వెళ్తారు? మారిన రాజకీయ వాతావరణంలో నీడను కూడా నమ్మలేని స్థితిలో ఉన్న నాయకులు.. ఆహ్వానాన్ని మన్నిస్తారా? ఆహ్వానాలు అందుకున్న తెలంగాణ నేతలు తేల్చుకోలేకపోతున్నారా? సెప్టెంబర్ 2. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఈ తేదీపైనే ఎక్కువ మంది ఫోకస్ పెట్టారు. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి కావడంతో.. ఆ రోజున హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన…
ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరే ఎడమొఖం పెడమొఖంగా ఉండే వాళ్ళు. ఇద్దరు కలిసి ఒక కార్యక్రమానికి హాజరైరా మాటలు ఉండేవి కావు. ఇప్పుడా ఇద్దరి మధ్యా మూడో వ్యక్తి ఎంట్రీతో మరింత గ్యాప్ పెరిగిందట. చివరికి మా ఎమ్మెల్యేని తక్కువ చేస్తే ఊరుకోం అని సంకేతాలిస్తున్నారట.. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గo. ఒకప్పుడు టీడీపీ కంచుకోట. ఈ నియోజకవర్గంలో లో 2019 మినహా గతంలో…
టిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనుందా? ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం తర్వాత ఆ దిశగా అడుగులు పడే ఛాన్స్ ఉందా ? అనువైన రాజకీయ పరిస్థితుల కోసం గులాబీ పార్టీ ఎదురు చూస్తోందా ? టిఆర్ఎస్ ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 2 న సీఎం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. టిఆర్ఎస్ ప్రస్థానంలో ఢిల్లీలో…
కామ్రేడ్ లు… క్లారిటీ తో ఉన్నారా… ?లేక కన్ఫ్యుజ్ అవుతున్నారా..? క్లారిటీ లేకపోవడంతోనే వరుస ఓటముల మూటగట్టుకుంటున్న కామ్రేడ్ లు…ఎక్కడ తప్పులో కాలు వేస్తున్నారు? తెలంగాణ ఏర్పాటు తర్వాత కామ్రేడ్ లు కునుకుపాట్లు పడుతున్నారు. ఒకప్పుడు రాజకీయం అంతా కామ్రేడ్ ల చుట్టూ తిరిగేది. కానీ ఇప్పుడు రాజకీయాల చుట్టూ కామ్రేడ్ లు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అటు సీపీఐ, ఇటు సీపీఎం రెండు పార్టీలు కూడా ఎవరితో కలిసి పని చేయాలనే క్లారిటీ లేకుండా పోతోందనేది ఓపెన్…
ఖాకీలకు కొన్ని పోలీస్ స్టేషన్లపై సెంటిమెంట్ ఎక్కువ. కలిసి వస్తుంది అనుకుంటే.. పోస్టింగ్‌ల కోసం ఓ రేంజ్లో పైరవీలు చేస్తారు. అదే రివర్స్‌లో ఉంటే పోలీస్ స్టేషన్ పేరు చెబితేనే హడలెత్తిపోతారు. ప్రస్తుతం ఆ PS గురించి అదే చర్చ జరుగుతోంది. మాకొద్దీ తలనొప్పి అని విసుగెత్తిపోతున్నారట అధికారులు. వైసీపీ, టీడీపీ మధ్యలో పోలీస్‌గా చర్చల్లో ఉన్న ఆ కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. అధికారులు లేక స్టేషన్ ఖాళీ! చిత్తూరు జిల్లా చంద్రగిరి. పోలీస్‌శాఖ పరంగా…
తెలంగాణ ఆర్టీసీని సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ సెట్ చేస్తారా? పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ముద్రపడ్డ ఆయన్ని ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీకి పంపింది? ఎవరికి చెక్ పెట్టేందుకు తీసుకొచ్చారు? ఆర్టీసీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? సీనియర్ ఐపీఎస్‌తో మంత్రికి సఖ్యత కుదురుతుందా? తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు MDగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ వచ్చారు. ఈ నియామకంపై ఆర్టీసీతోపాటు.. ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీకి పూర్తిస్థాయి MD…