వికారాబాద్ జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గపోరులో కొత్త పోకడలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక ఎమ్మెల్సీ.. ఇద్దరు ఎమ్మెల్యేలు. అంతా ఒకే పార్టీ. సంస్థాగత కమిటీల కూర్పులో కలిసి సాగుతున్నారా అంటే.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్..! అనుచరులను అందలం ఎక్కించేందుకు ఏకంగా బలప్రదర్శన మొదలెట్టేసి.. గులాబీ శిబిరంలో గుబులు రేపుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా కథా?
వికారాబాద్ జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గపోరులో కొత్త పోకడలు..!
Also Read
ఏదైనా పదవొచ్చినా.. పెద్ద నాయకుడు పార్టీలో చేరినా.. ఈ స్థాయిలో టీఆర్‌ఎస్ ఆఫీస్ దగ్గర సందడి కామన్. కానీ.. ఒక జిల్లా అధ్యక్ష పదవి కోసం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శ్రేణుల బలప్రదర్శన ఇది. ఈ శక్తి ప్రదర్శన మూలాలు సిటీకి ఆనుకుని ఉండే వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఒకరికి.. ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌లు మరొకరికి మద్దతుగా నిలవడంతో ఆ ప్రకంపనలు ఇలా హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్ వరకు వచ్చాయి.
నరసింహారెడ్డికి తాండూరు, వికారాబాద్ ఎమ్మెల్యేల మద్దతు?
కొండల్‌రెడ్డికి మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అండ?
టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి పార్టీ నేతలు నరసింహారెడ్డి, కొండల్ రెడ్డిలు పోటీపడుతున్నారు. వీరిద్దరూ తమకున్న పరిచయాల ద్వారా లాబీయింగ్ చేసుకుంటే స్థానికంగానే చర్చ జరిగేది. కానీ.. నరసింహారెడ్డి, కొండల్‌రెడ్డిల వెనక పెద్ద నాయకులే ఉండటంతో రచ్చ రచ్చ అవుతోంది. నరసింహారెడ్డికి వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మద్దతుగా ఉన్నారట. ఇక కొండల్‌రెడ్డికి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సాయం పడుతున్నట్టు సమాచారం. అనుచరుడిని టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిని చేసేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. అస్సలు వెనక్కి తగ్గకుండా.. అవకాశం చిక్కితే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని.. మందీమార్బలంతో శక్తిని చాటుతున్నారు నాయకులు.
తెలంగాణ భవన్‌లో నేతల బలప్రదర్శన..!
తన బలం వికారాబాద్‌కే పరిమితమైతే బాగోదని అనుకున్నారో ఏమో.. నరసింహారెడ్డి ప్రెజర్ పాలిటిక్స్‌ను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారు. ఇతర పార్టీ కార్యకర్తలను టీఆర్ఎస్‌లో చేర్పించే నెపంతో తెలంగాణ భవన్ దగ్గర ఓ రేంజ్‌లో హడావిడి చేశారు. తెలంగాణ భవన్‌కు దారితీసే ప్రధాన రహదారికి ఇరువైపులా భారీగా కటౌట్లు.. ఫ్లెక్సీలు నింపేశారు నరసింహారెడ్డి. ఇంకెవరినో టీఆర్‌ఎస్‌లో చేరుస్తూ ఈ స్థాయిలో కలరింగ్ ఇవ్వొచ్చా అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కునే పరిస్థితి. నరసింహారెడ్డిని బలపరుస్తున్న నాయకులు తెలంగాణ భవన్‌కు వచ్చారు కానీ.. పట్నం మహేందర్‌రెడ్డి కనిపించలేదు. దాంతో పార్టీలో కాసేపు చర్చ అటు కూడా మళ్లింది. నేతల బలప్రదర్శనతోపాటు వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లోని వర్గపోరును కూడా పరిచయం చేశారని గుసగుసలు వినిపించాయి. మొత్తానికి ఒక జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్యేలు.. నాయకులు ఈస్థాయిలో లాబీయింగ్ చేయడం గులాబీ శిబిరంలో పెద్ద చర్చే జరుగుతోంది.
- Tags
- off the record
- telangana
- TRS
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!