సీఎం కేసీఆర్ వదిలిన బీసీ బాణం.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ వదిలిన బీసీ బాణం.. బీజేపీని ఇరుకున పడేసిందా? బీసీ కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచారా? ఈ అంశం హుజురాబాద్‌లో అధికారపార్టీకి కలిసి వస్తుందా? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
దేశ రాజకీయాలలో బీసీ కుల గణనకు డిమాండ్స్..!
Also Read
బీసీ కుల గణన ఇప్పుడు దేశమంతా ఇదే హాట్ టాపిక్. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్ కూడా ఇదే. వెనకబడిన వర్గాలకు చెందిన పలు సంఘాలు కూడా ఇదే శ్రుతి అందుకున్నాయి. ఇలాంటి సమయంలోనే తెలంగాణ శాసనసభ కుల గణన చేపట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంత చర్చ జరుగుతున్నా.. కేంద్ర సర్కార్ మౌనం రాజకీయ పక్షాలకు అంతుచిక్కడం లేదు. పైగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో బీసీ కుల గణన సాధ్యం కాదని చెప్పేసింది మోడీ ప్రభుత్వం.
రాష్ట్రాల వారీగా కుల గణన చేసుకోవచ్చన్నది బీజేపీ వాదన?
ఈ వ్యవహారం బీజేపీని ఇరకాటంలో పడేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్లకుండా.. తాము బీసీ కుల గణనకు వ్యతిరేకం కాదని చెబుతున్నా.. ఇందుకు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని వెల్లడిస్తోంది. న్యాయ, సాంకేతిక, పాలనా పరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఆచితూచి స్పందిస్తుందన్నది బీజేపీ వాదన. ఒక కులం ఒక రాష్ట్రంలో ఓసీ అయితే.. అదే కులం మరో రాష్ట్రంలో బీసీగా ఉందని.. ఇలా దేశవ్యాప్తంగా లక్షల కులాలు ఉన్నాయని.. అందుకే రాష్ట్రాల వారీగా బీసీ కుల గణన చేసుకోవచ్చని బీజేపీ వాదనగా ఉంది.
హిందూ ఐక్యత సాధ్యంకాదని ఆర్‌ఎస్‌ఎస్ ఆందోళన?
కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సుముఖత వ్యక్తం చేయకపోవడానికి బలమైన కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. బీసీ కుల గణన చేపడితే తేనె తుట్టెను కదిపినట్టేనని బీజేపీ భయపడుతోందట. సంఘ పరివార క్షేత్రాలు, ప్రధానంగా RSS కుల గణనను వ్యతిరేకిస్తున్నట్టు టాక్. ఇప్పటికే హిందు సమాజం కులాల పేరుతో చీలి పోయిందని.. బీసీ కుల గణన జరిగితే కులాల మధ్య దూరం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నాయట ఆ సంస్థలు. హిందు ఐక్యత సాధ్యం కాదని చెప్పేసిందట. అందుకే కేంద్రం ఈ అంశంపై వెనకంజ వేస్తున్నట్టు సమాచారం.
అసెంబ్లీ తీర్మానం హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు కలిసి వస్తుందా?
అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా హుజురాబాద్ ఉపఎన్నికలోనూ పైచెయ్యి సాధించేలా సీఎం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడ వేసినట్టు తెలంగాణ బీజేపీ అనుమానిస్తోంది. హుజురాబాద్‌లో బీసీ అభ్యర్థిని బరిలో దించడం.. అక్కడ లక్షకు పైగా బీసీ ఓటర్లు ఉండటంతో.. ఈ ఎత్తుగడ కలిసి వస్తుందనే ఆలోచన అధికార పార్టీలో ఉందట. కేంద్రం వైఖరి ఎలా ఉన్నా.. ఇప్పుడు హుజురాబాద్‌లో ఈ అంశం చూపించే ప్రభావంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది.
- Tags
- bjp
- cm kcr
- off the record
- telangana
తాజావార్తలు
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్‌సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!