ఆ ఎంపీ పార్టీ మార్పుతో గులాబీ దళం ఇరకాటంలో పడిందా? దీటైన అభ్యర్థి దొరక్క తంటాలు పడుతోందా? ఎందుకా పరిస్థితి తలెత్తింది? ముందస్తు సంకేతాలు ఉన్నా… జాగ్రత్తలు తీసుకోకపోవడానికి కారణాలేంటి? ఏదా నియోజకవర్గం? రేస్‌లో ఉన్న నాయకులు ఎవరు? ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్కి లోక్ సభ ఎన్నికలకి ముందు భారీ షాక్ తగిలింది. అది ఊహించిన పరిణామమే అయినా…ముందు జాగ్రత్త లేకపోవడంతో పార్టీ మాత్రం డైలమాలో పడిందట. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కి…
ఆ బీజేపీ ముఖ్యనేత ఐ వాంట్ టు ఫాలో.. ఫాలో అంటున్నారా? ఆ… అయ్యేదేదో సొంత పార్టీ వాళ్ళని కాకుండా రాజకీయ ప్రత్యర్థుల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారా? వాళ్ళు వీళ్ళు అయితే… కిక్కేముంటుంది… మన రేంజ్‌కి తగ్గట్టు ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డినే అనుకరిద్దామనుకుంటున్నారా? కాలం, ఖర్మం కలిసొస్తే రేవంత్‌లాగే తానూ అదో ఒక రోజున సీఎం అవ్వొచ్చని కలలుగంటున్నారా? ఇంతకీ ఎవరా లీడర్? ఏంటాయన కథ? పోగొట్టుకున్న చోటే వెదుక్కోమన్నది పెద్దల మాట. కానీ… అన్ని చోట్ల, అన్ని…
టీడీపీలో కొత్త ట్రబుల్ షూటర్స్ దిగారా? చంద్రబాబు వాళ్ళకు స్పెషల్ టాస్క్ ఇచ్చారా? పార్టీకి సంక్లిష్టంగా ఉండే నియోజకవర్గాలనే కొత్త నేతలకు టార్గెట్‌గా పెట్టారా? తన రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా…. ఏ నిర్ణయం తీసుకున్నా ఫర్లేదు, రిజల్ట్ ముఖ్యం అంటూ చంద్రబాబు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారా? ఇంతకీ ఎవరా ట్రబుల్ షూటర్స్? ఏంటా స్టోరీ? చంద్రబాబు సొంత జిల్లా అయినా…ఉమ్మడి చిత్తూరు టీడీపీకి ఎప్పుడూ సంకటంగానే ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక, అసమ్మతిని నియంత్రించడం కత్తిమీద సాములాగే…
ఆ జిల్లాలో పసుపు, చక్కెర కలిసిపోయి పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. గత ఎన్నికల్లో పసుపు ఒకరికి శుభం పలికితే… ఇంకొకరికి మర్చిపోలేని మంట పుట్టించింది. ఇప్పుడిక చక్కెర వంతొచ్చింది. ఇప్పుడది ఎవరికి స్వీటు? ఎవరికి ఘాటు కాబోతోంది? అసలు పసుపు, చక్కెర చుట్టూ జరుగుతున్న పొలిటికల్ గేమ్ ఏంటి? ఎక్కడ జరుగుతోందా రాజకీయం? నేతల మాటల్ని జనం మూట కట్టుకుంటున్నారా? పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే.. నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. కాకుంటే… బోధన్ చక్కెర…
పేరుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. కానీ… పిలిచి టిక్కెట్ ఇచ్చే దిక్కులేదు. రమ్మని పిలిచే పార్టీ లేదు. నువ్వొస్తానంటే మేమొద్దంటామని ముఖం మీద తలుపేసేవాళ్ళు తప్ప మాజీ మంత్రి సీనియారిటీని వాడుకుందామనుకునే వాళ్ళు మాత్రం లేరు. చివరికి ఇప్పుడు చేరిన పార్టీలో కూడా వితౌట్ కండిషన్స్ అంటున్నారట. ఇంతకీ అంత దారుణమైన స్థితిలో ఉన్న నాయకుడెవరు? ఎందుకంత దుస్థితి దాపురించింది? కొత్తపల్లి సుబ్బారాయుడు….. పశ్చిమగోదావరి జిల్లాలో సీనియర్ లీడర్. ఓటమి ఎరుగని నేతగా ట్యాగ్‌లైన్. కానీ… అదంతా…
శాసన మండలిలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరు? పోటీ పడుతున్న ఎమ్మెల్సీలు ఎవరెవరు? అధిష్టానం మనసులో ఉన్నదెవరు? కౌన్సిల్లో అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఎవరికి ఉందని కారు పార్టీ పెద్దలు భావిస్తున్నారు? దాంతో పాటు వాళ్ళు చెబుతున్న ఈక్వేషన్స్ ఏంటి? తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండున్నర నెలలవుతోంది. రెండు విడతల అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి. ప్రభుత్వం చీఫ్ విప్, విప్ లను ప్రకటించింది. ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్స్‌ని ప్రకటించాయి.…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఏక్ నిరంజన్ తయారయ్యారా? అంతా తానై నడపాలనుకుంటున్నారా? ఢిల్లీ స్థాయిలో నా పరపతి అరచేతి మందాన ఉంది. మిగతా వాళ్ళని లెక్కచేయాల్సిన అవసరం ఏంటని అనుకుంటున్నారా? తనలాగే వచ్చిన వారిని కావాలని పక్కకు పెడుతున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? సమన్వయ లోపం, పరస్పరం గోతులు తీసుకోవడం, కలహించుకోవడమన్నది కాంగ్రెస్ పార్టీలో కామన్. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక మా పార్టీలో అలాగే ఉంటుంది. అదే మాకు బలం అని కూడా…
కాడెడ్లలా కలిసి నడవాల్సిన, పార్టీని నడిపించాల్సిన వాళ్ళు కీచులాటలకు దిగుతున్నారు. కేరాఫ్ కలహాల కాపురంలా మారిందట వారి వ్యవహారం. నాకు ఒక కన్ను పోయినా ఫర్వేదు… ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలన్న సిద్ధాంతంతో పనిచేసిన ఇద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. చివరికి సవతి ముండమోయాలన్నట్టుగా మారిందట ఇద్దరి వ్యవహారం. ఎవరా ఇద్దరు నేతలు? ఏంటి వాళ్ళ కీచులాట కహానీ? ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ల మధ్య విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గే సూచనలైతే…