ఉంచేద్దామా? మూసేద్దామా? సూటిగా, సుత్తిలేకుండా చెప్పండి. ఆఫీస్‌లకు అద్దె కూడా కట్టకుండా మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? క్లారిటీ ప్లీజ్… ఇదీ బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతల ఆవేదన. ఆ ఆవేదనతోనే కేసీఆర్ మీదికి లేఖాస్త్రాన్ని సంధించారా లీడర్స్. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఉన్నట్టా? లేనట్టా? ఆఫీస్ బిల్డింగ్‌లకు అద్దె కట్టడం లేదు, మా ఫోన్లు ఎత్తడం లేదు. సంబంధమే లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. మేం పార్టీలో ఉన్నట్టా? లేనట్టా? అసలు మా రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఉంచుతున్నారా?…
ఉన్నవి చాలవన్నట్టు టీడీపీ నేతల మీద కొత్త కొత్త కేసులు పడబోతున్నాయా? ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్థులే టార్గెట్‌గా బుక్ అవుతాయని పార్టీ అనుమానిస్తోందా? టీడీపీ అధిష్టానానికి ఇప్పుడా డౌట్ ఎందుకు వచ్చింది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటోంది? అసలీ కొత్త కేసుల కథేంటి? ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రేపోమాపో షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ వెంటనే నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మంది అభ్యర్థులను ప్రకటించేశాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు…
సీటూ మాదే… ఓటు వేటా మాదేనంటూ ఇన్నాళ్ళుగా తొడలు కొట్టుకుంటూ తిరిగిన ఆ సీనియర్స్‌కి ఇప్పుడు సీట్లు చిరిగిపోతున్నాయా? కష్ట కాలంలో, క్లిష్ట సమయాల్లో సైతం గెల్చిన నేతలు ఇప్పుడు టీడీపీకి ఎందుకు కానివారయ్యారు? ఉమ్మడి వెస్ట్‌లో సూపర్ సీనియర్స్ అనుకున్నవారిని సైతం ఫస్ట్ లిస్ట్‌లో పార్టీ అధిష్టానం ఎందుకు పక్కన పెట్టింది? ఎవరా నేతకు? ఎందుకలా జరిగింది? ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్స్‌కి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. తమ రాజకీయ జీవితంలో…
లోక్‌సభ ఎన్నికల్లో దున్నేస్తాం…. దుమ్ము దులిపేస్తాం…. తెలంగాణలో డబుల్ డిజిట్ కొట్టేస్తామని సవాళ్ళు చేస్తున్న కాషాయ దళానికి ఆ జిల్లాలో నడిపే నాయకుడు లేడట. ప్రతి సీటు ముఖ్యమని భావిస్తున్న టైంలో రెండు నియోజకవర్గాలున్న జిల్లాను పార్టీ నాయకత్వం ఎందుకు లైట్ తీసుకుంది? మాకో నాయకుడు కావాలి మొర్రో….. అని కేడర్ మొత్తుకుంటున్నా పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఏదా జిల్లా? ఏవా రెండు నియోజకవర్గాలు? లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి టార్గెట్ 400 అంటోంది…
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం ఎందుకు హాట్ సీటైంది? అన్ని ప్రధాన పార్టీలు అక్కడే ఎందుకు ఫోకస్ చేస్తున్నాయి? అదే నియోజకవర్గం కేంద్రంగా సీఎం రేవంత్‌ని టార్గెట్ చేసుకుని కేటీఆర్ మాటల తూటాలు పేల్చడానికి కారణాలేంటి? అన్ని పార్టీల్లో మల్కాజ్గిరి మల్లగుల్లాలకు కారణాలేంటి? లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం ప్రత్యేకమే అయినా… తెలంగాణలోని ఆ ఒక్కటి మాత్రం హాట్ సీటుగా మారిపోయింది. అన్ని పార్టీల్లో దాని కోసం విపరీతమైన పోటీ ఉంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో…
అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు కొలిక్కి వచ్చిందా? ఫస్ట్ లిస్ట్‌లో ఎన్నిపేర్లు ప్రకటించే అవకాశం ఉంది? ఏయే స్థానాలకు ఎవరెవరు ఖరారయ్యారు? అసలు లిస్ట్ ప్రకటన ఎప్పుడు ఉండవచ్చు? పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏం తేల్చబోతోంది? పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు మెల్లగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్లు విడతల వారీగా పేర్లను వెల్లడిస్తున్నాయి. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. ఇటీవల…
బీఎస్పీతో దోస్తీ బీఆర్ఎస్లో చిచ్చు పెట్టిందా? సీనియర్ లీడర్ కారు దిగడానికి కారణం అవుతోందా? నిన్నటి ఎన్నికల్లో నన్ను బండబూతులు తిట్టిన మనిషితో నేడు చెట్టపట్టాలేసుకుని తిరగమంటారా? నావల్ల కాదంటూ గులాబీకి బైబై చెప్పేసిన ఆ లీడర్ ఎవరు? పక్క పార్టీలో ఆయనకు లభించిన హామీ ఏంటి? సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగేస్తున్నారు. హస్తం గూటికి చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ అయిన…
ఆ సీటు యమా… హాట్. హాటంటే.. అలాంటిలాంటి హాట్ కాదు గురూ… అంటున్నారు టీడీపీ, జనసేన నాయకులు. అందుకే రెండు పార్టీల నుంచి డజన్ మంది మాక్కావాలంటే మాకంటూ పోటీలు పడుతున్నారు. ఎవరి లెక్కలతో వారు లాబీయింగ్ చేస్తున్నారు. పోటీ తట్టుకోలేక చివరికి లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దన్న నినాదాన్ని కూడా తెర మీదికి తెచ్చారు. ఇంతకీ ఏదా హాట్ సీట్? ఏంటి అక్కడ స్పెషల్? తిరుపతి ఆధ్యాత్మికంగా ఎంత ఫేమస్సో…. పొలిటికల్‌గా ఈ అసెంబ్లీ…