బాల రాముని ప్రాణ ప్రతిష్ట ప్రపంచం మొత్తం వీక్షించిందన్నారు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర దేశాలలో నుండి కూడా మట్టి,నీరు బట్టలు ఈ బాలరాముని ప్రాణ ప్రతిష్ట కు పంపించారన్నారు. బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఆత్మగౌరవ ఈవెంట్‌గా జరిగిందన్నారు. తెలంగాణా ప్రభుత్వం అయోధ్యలో కార్యక్రమం జరుగుతుంటే పట్టనట్టు నడుచుకున్నారన్నారు. తెలంగాణాలోని ప్రధాన దేవాలయాల నుండి సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి.. కానీ అవేవీ లేకుండా ఈ ఎండోమెంట్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో పెట్టుబడులు తీసుకువస్తున్నామని చెప్పారని, అదానీ గ్రూపుతో 12వేల కోట్ల ఒప్పందాలు కుదిరాయని ప్రకటించారన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు అదానీ, అంబానీకీ మోడీ దేశ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారని, పని గట్టుకొని ప్రధానిపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. కేటీఆర్ తెలంగాణ ప్రతినిధిగా ఐదు సార్లు దావోస్ పర్యటనకు వెళ్లారని, గత ప్రభుత్వం 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని గొప్పగా…
NVSS Prabhakar: తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పట్టారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రధాని రూ. 11 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించారు, ఇది కేసీఆర్ కు కంటగింపుగా ఉన్నట్లుంది, అందుకే కేసీఆర్ గైర్హాజరయ్యారని ఆరోపించారు.
నగరం లోపల, వెలుపల పెద్ద ఎత్తున అక్రమ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా పురపాలక శాఖ మంత్రికి పట్టదని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహసంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు వివక్ష, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.