NVSS Prabhakar: నగరం లోపల, వెలుపల పెద్ద ఎత్తున అక్రమ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా పురపాలక శాఖ మంత్రికి పట్టదని ఆయన విమర్శించారు. పురపాలక శాఖ మొత్తం అవినీతి మయమైందని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కేటీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ ఒక అసమర్థ మంత్రి అంటూ మండిపడ్డారు. ప్రతి కంపెనీ పెట్టుబడిలో కేటీఆర్ వాటా ఉందన్న ఆయన.. పారిశ్రామిక వాడల మీద కేటీఆర్ కన్ను వేశారని… ఆస్తులను కాజేస్తున్నారని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.
బీఆర్ఎస్ అప్లికేషన్ మీద సంతకం పెట్టేందుకు, ఢిల్లీలో భవన శంకుస్థాపనకు, ఖమ్మం సభకు కేటీఆర్ రాలేదని ఆయన చెప్పారు. దీనిని బట్టి చూస్తే హరీశ్‌రావును ఢిల్లీకి వెళ్లగొట్టి.. రాష్ట్రాన్ని కేటీఆర్ హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మంత్రి వర్గంలో అతిపెద్ద అవినీతి మంత్రి కేటీఆర్ అంటూ ధ్వజమెత్తారు. కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ కూడా కేటీఆర్ దుర్భుద్దే అంటూ విమర్శించారు. కంటి వెలుగులో తొలి కంటి ఆపరేషన్ కేసీఆర్‌కు చేయించాలన్నారు. కేసీఆర్ కళ్లకి అద్దాలు పెట్టించి.. మోడీ అభివృద్ధిని చూపించాలన్నారు.
CM K.Chandrashekar Rao: రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష
దేశంలోనే ఏకైక దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. శాసనసభ, మండలికి కేసీఆర్ అర్థం లేకుండా చేశారన్నారు. శాసన మండలి ఛైర్మన్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి కానీ.. ఆయన రోజూ రాజకీయాలే మాట్లాడుతున్నారన్నారు. శాసన మండలి చైర్మన్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలు మాట్లాడాలని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.