బాల రాముని ప్రాణ ప్రతిష్ట ప్రపంచం మొత్తం వీక్షించిందన్నారు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర దేశాలలో నుండి కూడా మట్టి,నీరు బట్టలు ఈ బాలరాముని ప్రాణ ప్రతిష్ట కు పంపించారన్నారు. బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఆత్మగౌరవ ఈవెంట్‌గా జరిగిందన్నారు. తెలంగాణా ప్రభుత్వం అయోధ్యలో కార్యక్రమం జరుగుతుంటే పట్టనట్టు నడుచుకున్నారన్నారు. తెలంగాణాలోని ప్రధాన దేవాలయాల నుండి సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి.. కానీ అవేవీ లేకుండా ఈ ఎండోమెంట్ శాఖ, ప్రభుత్వం పట్టించుకోలేదని, సాంప్రదాయ పద్దతులు పాటించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఈ విషయంలో ఎండోమెంట్ శాఖ క్షమాపణ చెప్పాలని, ఈ విషయంలో గవర్నర్ నీ కలిసి కంప్లైంట్ చేస్తామన్నారు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్. బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోపల బొంద పెడతా అని సీఎం అన్నందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభినందించడానికి రేవంత్ రెడ్డి నీ కలిసారా అని ఆయన అన్నారు. జాతీయ రుణాలు పొందడానికే మూసి నదిని ప్రక్షాళన చేస్తా అని సీఎం చెబుతున్నారన్నారు. గతంలో కేసిఆర్ కూడా ఇలాగే హుస్సేన్ సాగర్ లో కొబ్బరినీళ్లు నింపుతా అన్నాడని, అందినంత దోచుకోవాలని అప్పుడు బిఅర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయన్నారు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్. మొదటి మాసంలో ప్రభుత్వం చెల్లించిన బిల్లులను బహిర్గతం చేయాలన్నారు. 6 గారంటీలకు మళ్ళీ అప్పులు చెయ్యడం ప్రారంభించారని, మొదటి నెల చెల్లించిన బిల్లులు బయటికి చెప్పకపోతే మేమే భాహిర్గతం చేసేలా చేస్తామన్నారు.