హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు పలువురు టీఆర్ఎస్ నేతలు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ఎంపీపీ తాడురి వెంకట రెడ్డి, మాజీ జెడ్పీటీసీ, మండల తెరాస పార్టీ మాజీ అధ్యక్షుడు పెద్దిటి బుచ్చి రెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కంది లక్ష్మా రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతలకు వెల కడుతున్న నీచమైన పార్టీ టీఆర్ఎస్. ఇలా చేస్తే హుజూరాబాద్ ప్రజలు చెంప చెళ్లుమనిపించినా కూడా కెసిఆర్ కి బుద్ది రాలేదు.
Read Also: Mp Arvind: మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎందుకంత ఉలుకు?
కెసిఆర్ పద్దతి పట్ల వెగటు పుట్టి ఆ పార్టీ నేతలు బయటికి వస్తున్నారు. అలా వచ్చే వారిపై కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు వేయవద్దు. భయపెట్టింది లొంగ దీసుకుంటాం అంటే తెలంగాణ సమాజం లొంగదు. టీఆర్ఎస్ ను ఎదుర్కోనే ఏకైక పార్టీ బీజేపీ. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎన్నికల ముందో తరువాతనో కలిసిపోతాయి.. బీజేపీ కార్యకర్తలు, నాయకులు మనో నిబ్బరం కోల్పోవద్దు. ఇన్నేళ్లు పని చేసారు ఇంకో 6 నెలలు కష్టపడి పనిచేయండి అధికారం మనదే.. ప్రజాసంగ్రామ యాత్రపై దాడులు చేసినా ఎవరూ అధైర్య పడవద్దు అన్నారు ఈటల.
మరో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలను కేసీఆర్ రాజకీయం చేశారన్నారు. గవర్నర్లు నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వెళ్లక పోవడం తప్పు.దిగజారుడు రాజకీయాలు కేసీఆర్ చేస్తున్నారు. రాజకీయ దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి కేసీఆర్ ఓర్వలేక పోతున్నారు. నెహ్రూ విగ్రహానికి కేసీఆర్ పూలదండ వేయడం.. కాంగ్రెస్ కు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. మునుగోడులో కాంగ్రెస్, టిఆర్ఎస్ కలిసి వ్యూహ రచన చేస్తున్నాయి. నితిష్ కుమార్ ని మధ్యవర్తిగా ఉంచి కాంగ్రెస్ కు దగ్గర కావడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. దాడులు చేసినా ప్రజాసంగ్రామ యాత్ర ఆగదన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.

Read Also: Asaduddin Owaisi: కాశ్మీర్ పరిస్థితికి మోదీ, అమిత్ షానే కారణం..