NVSS Prabhakar : నీతి ఆయోగ్ 10వ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. అయితే 9వ సమావేశానికి హాజరుకాలేదని గుర్తుచేస్తూ, “అప్పుడు ముఖ్యమంత్రి ఎవరినిమిత్తం, ఎందుకోసం గైర్హాజరయ్యారు?” అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. నీతి ఆయోగ్ సమావేశాల ఉద్దేశం రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న దానిపై కేంద్రం నమ్మకం పెట్టుకున్నదని ఆయన అన్నారు. “రెవంత్ రెడ్డి ఫెడరల్ స్పూర్తితో సమావేశంలో…
NVSS Prabhakar : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య ఓ రహస్య రాజకీయ డీల్ కుదిరిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ విలీనానికి గ్రౌండ్ వర్క్ మొదలైపోయిందని, ఇప్పటికే రెండుపార్టీల కీలక నేతల మధ్య రాజీ కుదిరిందని అన్నారు. ఈ డీల్‌లో భాగంగానే కాలేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోళ్ల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాలపై…
NVSS Prabhakar: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నేడు (మే 14)న మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తున్న, ఇకముందు కూడా చేస్తానని హరీష్ రావు చెప్పుకున్నారు.. కేటీఆర్ నాయకత్వంలో కూడా పని చేస్తానని వివరించుకున్నారు.. ఎందుకు హరీష్ రావు అలా మాట్లాడారన్నది ఇప్పుడు ప్రధాన అంశమని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలన పూర్తి అయి.. కాంగ్రెస్ పాలన ప్రారంభమైందని అన్నారు.…
హైదరాబాద్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. వీసా గడువు తీరిన చాలా మంది బంగ్లా, పాక్ దేశస్థులు హైదరాబాద్‌లో ఉన్నారన్నారు. వీరందరిని వెంటనే వెనక్కి పంపి వేయాలని డిమాండ్ చేశారు. వీరి ఏరివేతకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో రుజువైందని.. స్లీపర్ సెల్స్ కు హైదరాబాద్ ఎంపీ మద్దతు ఉందని ఆరోపించారు.
NVSS Prabhakar : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంబరాలు ఎవరి కోసం చేస్తున్నారని వారికే అర్థం కావడం లేదని, సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన కొద్దీ గంటలకే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. దేశంలోనే వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క అడుగు ముందుకు వేయలేదని, రాజకీయంగా మాదిగలను…
NVSS Prabhakar: గెలిచిన అభ్యర్థులను చెప్పమనండి రేవంత్ రెడ్డి వల్లే గెలిచామని NVSS ప్రకభార్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకుని బలమైన శక్తిగా ఎదిగిందన్నారు.
NVSS Prabhakar: ధాన్యం కొనుగోలు అవినీతిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి సమీక్షలకు సంబంధిత మంత్రులు హాజరుకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి రెవెన్యూ, ఇరిగేషన్, ఐటీ, పరిశ్రమల శాఖలో అక్రమాలు జరిగాయని ఎన్నో కథనాలు వచ్చాయన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం తో అవినీతి పెరిగిపోతోందని, కాంగ్రెస్ ఇన్చార్జి ల పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మాణిక్ రావు ఠాక్రే, ఠాగూర్ లపై ఆధారాలు ఉన్నాయని చెప్పారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవ్వరిపై కూడా…
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని గతంలోనే పార్టీ అధిష్టానానికి చెప్పానని, జనంలో తిరస్కరించినబడిన వాళ్లు.. పదవుల కోసం విమర్శలు చేస్తున్నారన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఠాగూర్, ఠాక్రే మీద ఆరోపణలు,వాస్తవాలను బయట పెట్టింది… అధిష్టానానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ నాయకులు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఇద్దరు ఇంచార్జీలు కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తే.. ఎందుకు మార్చారో కాంగ్రెస్ అధిష్టానం చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం…
Mahesh Kumar Goud: బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ పై ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. తమ పార్టీ రాష్ట్ర వ్యవహాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీపై అబద్దపు వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.