ఆ లోక్‌సభ నియోజకవర్గంలో ఇద్దరూ కొత్త అభ్యర్థులే. రాజకీయ వారసత్వాలు తప్ప… ఎవ్వరికీ డైరెక్ట్‌గా ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు. అయినా.. ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని కొత్త కొత్త పాయింట్స్ బయటికి వస్తున్నాయి. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏంటా స్టోరీ? ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలక్షన్ హీట్ సమ్మర్ సెగల్ని మరిపిస్తోంది. గతంలో ఎప్పుడూలేని విధంగా జరుగుతున్న పరిణమాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. నియోజకవర్గానికి కొత్త…
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కమలం పార్టీ అభ్యర్థి ఎవరు? మిగతా ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేసినా… బీజేపీ ఎందుకు ఇంకా వేచి చూస్తోంది? ఉప ఎన్నిక అభ్యర్థి విషయమై పార్టీకి ఉన్న లెక్కలేంటి? ఇక్కడ కూడా ఇంపోర్టెడ్ కల్చరే ఉంటుందా? లేక పార్టీ పాత నేతలకు అవకాశం ఇస్తారా? కంటోన్మెంట్ కేంద్రంగా కమలం పార్టీలో ఏం జరుగుతోంది? లోక్ సభ ఎన్నికలతో పాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఇప్పుడిప్పుడే…
నేడు 8వ రోజు సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. తిరుపతిలోని గురువరాజు పల్లెలో ఉదయం 9 గంటలకు జగన్ బస్సు యాత్ర ఆరంభం కానుంది. మల్లవరం, ఏర్పేడు మీదుగా శ్రీకాళహస్తి బైపాస్.. అక్కడి నుంచి సింగనమల మీదుగా యాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు డ్రైవర్స్ అసోసియేషన్స్ తో జగన్ ముఖాముఖి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కాళహస్తి నాయుడుపేటలో బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. నేడు కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ…
తెలుగుదేశం పార్టీని ఇప్పుడు పెన్షన్ టెన్షన్ వెంటాడుతోందా? వైసీపీ మైండ్‌గేమ్‌తో టీడీపీ నాయకులు కంగారు పడుతున్నారా? దానివల్ల సైకిల్ పార్టీకి ఎంత నష్టమో… వైసీపీకి కూడా అంతే ఎఫెక్ట్ అన్న వాదనలో నిజమెంత? అలా వాదిస్తున్నవారు చెప్పే రీజన్స్ ఏంటి? ఏతావాతా ఇప్పుడు పెన్షన్స్ చుట్టూ మొదలైన కొత్త రాజకీయం ఏ టర్న్ తీసుకునే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సామాజిక భద్రత పెన్షన్ల అంశమే హాట్ టాపిక్ అయింది. పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా…
హైదరాబాద్‌లో బీఆర్ఎస్కు ఇంకో సూపర్ షాక్ తగులబోతోందా? గ్రేటర్ పరిధిలో ఉన్న మరో ఎమ్మెల్యే కారు దిగేసి కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమైపోయారా? ఇక గేర్ మార్చడమే మిగిలి ఉందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారన్న సంగతి తెలిసే అక్కడి హస్తం నేతలు ఆందోళన పడుతున్నారా? లెట్స్ వాచ్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బలాన్నిచ్చి పార్టీ పరువు కాపాడిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీకి ఇక వరుస దెబ్బలు తగలబోతున్నాయా? అంటే……
పవన్‌కళ్యాణ్ సినిమాల్లోని ట్విస్ట్‌ల కంటే ఎక్కువగా ఆ అసెంబ్లీ అభ్యర్థి ఎంపికలో ఉన్నాయి. సర్వే రిపోర్ట్స్ బాగాలేవని టీడీపీ పక్కనపెట్టిన అభ్యర్థికే ఇప్పుడు జనసేన పిలిచి టీ గ్లాస్ చేతిలో పెట్టి మరీ టిక్కెట్ ఇస్తోంది. ఆయనకే ఇవ్వాలనుకున్నప్పుడు ఇన్నాళ్ళు ఇంటర్వ్యూల పేరుతో రకరకాల లెక్కలు ఎందుకు వేసినట్టు? అసలు టీడీపీ కాదనుకున్న లీడర్ జనసేన అభ్యర్థిగా ఎలా తెర మీదికి వచ్చారు? తెర వెనక ఏం జరిగింది? ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేన బరిలోకి దిగుతున్న ఒకే…
తానొకటి అనుకుంటే… పైవాడు ఇంకోటి తలచాడన్నట్టుగా ఉంది ఆ సీనియర్ లీడర్ పరిస్థితి. చివరిదాకా టిక్కెట్ నాదేనని అనుకున్నారాయన. టీడీపీ పెద్దలు కూడా అదే భ్రమలో ఉంచారు. లాస్ట్ మినిట్‌లో తగిలిన షాక్‌కు గింగిరాలు తిరిగిన ఆ మాజీ ఎమ్మెల్యే వెంటనే తేరుకుని నట్లన్నీ బిగించేశారు. ఇప్పుడు పార్టీ పెద్దలు ఓపెన్ చేద్దామన్నా వీలుకానంత గట్టిగా బిగుసుకుపోయింది వ్యవహారం. ఇంతకీ ఎవరా లీడర్? ఏంటాయన టిక్కెట్ వ్యవహారం? అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం తెలుగుదేశానికి కొన్ని చోట్ల…
తుపాకీ తూటా….మనిషి మాట….ఒక్కసారి బయటకు వచ్చాయంటే చెయ్యాల్సిన నష్టం చేసేస్తాయి. రాజకీయాల్లోనైతే ఒక్కోసారి ఆ మాట చేసే నష్టం ఊహకు అందదు. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లోనూ ఓ మాట తూటాలా పేలింది. ఒకరికి అది బౌన్సర్ గా మారితే…మరొకరికి బౌన్స్ బ్యాక్ గా ఫుల్ పబ్లిసిటీ వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఇది ఎన్నికల సమయం. మాటే తూటా. ఒక్కోసారి ఆ మాటల తూటా రివర్స్ అయి మనకే తగులుతుంది. ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి…
అక్కడ ఆయన…ఇక్కడ ఈయన. ఫేటు మారుస్తాయన్న కాన్ఫిడెన్స్ తో చేస్తున్న లేటు వయస్సు…ఘాటు రాజకీయాలు హాట్ హాట్ డిస్కషన్ గా మారాయి. రాజకీయ చరమాంకంలో ఆ ఇద్దరి అడుగులు ఎటువైపు అంటూ అనుచరులే తెగ మాట్లాడుకుంటున్నారు. పొన్నాల లక్ష్మయ్య….కడియం శ్రీహరి….దశాబ్దాలుగా రాజకీయాల్లో వున్నవారే. ఇద్దరూ వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు. వీరి రాజకీయాలు కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగా మారిపోయాయి. లక్ష్మయ్య నాలుగు టర్మ్ లు, కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచి 2023 ఎన్నికలు…
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో.. ఆ జిల్లా నేతలు కొత్త నినాదం అందుకున్నారు. తాను గెలిస్తే.. ఆ పదవి ఖాయం అంటూ ప్రచారం చేస్తున్నారు. మేమే అధికారంలోకి వస్తున్నాం, ఎంపీ సీటును మాకిస్తే.. మీకో గ్యారెంటీ ఇస్తామంటున్నారు. ఇంతకీ ఏంటా గ్యారెంటీ..? నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అర్వింద్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్ధులుగా తలపడుతున్నారు.…