ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, రాజ్యాంగం రద్దు చేస్తున్నారని.. అది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. ఈ ఎన్నికల్లో తాము గెలిచేందుకు ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి సీఎం సర్టిఫికెట్ తమకు అవసరం లేదని విమర్శించారు. రాజ్యాంగంలో లోపాల్లేవు.. పాలకుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. కాగా.. రాష్ట్రానికి బీజేపీ ఏమీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు చూపుతున్నారని.. గాడిదతో గుడ్లు పెట్టిస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఫర్టిలైజర్ పరిశ్రమ, ఆర్ఆర్ఆర్, ఎన్టీపీసీ ప్రాజెక్టులు గాడిద గుడ్లా..? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడొచ్చా..? అని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Thalaimai Seyalagam: శ్రియారెడ్డి లీడ్ రోల్ లో పొలిటికల్ థ్రిల్లర్
తాము తెలంగాణకు ఏమిచ్చామో చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ది మూర్కుల ప్రభుత్వం .. కేసీఆర్కు గతంలో 40 లేఖలు రాసినా స్పందించలేదన్నారు. కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తుకు తాము సిద్ధమని తెలిపారు. ఇతర నేతలు మాట్లాడినట్లు తాను మాట్లాడలేనని.. 8 సీట్లున్న తాము తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తాం..? అని ప్రశ్నించారు. కవిత అరెస్ట్ తో తమకెలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు.. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం సాధ్యం కాదు.. అక్కడి ఐరన్ ఓర్ స్టీల్.. ఉత్పత్తికి సరిపోదన్నారు. ఇదిలా ఉంటే.. విశాఖ స్టీల్ ఫ్లాంట్ నుఇప్పుడు అమ్మే పరిస్థితి లేదన్నారు.
Anil Ravipudi: అందుకే ఐపీఎల్ గురించి అలా మాట్లాడా.. రావిపూడి క్షమాపణలు !
తమ హయాంలో జరిగినంత అభివద్ధి ఎన్నడూ జరగలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్ని ఉద్యోగాలు కల్పించామో కళ్లముందు కనబడుతోందన్నారు. మరోవైపు.. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని.. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగాల్సిందేనని, తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నది నిజమేనన్నారు.