PM Modi: తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తెలంగాణలో బీజేపీ అన్ని పార్లమెంట్ స్థానాలను క్లీన్‌స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 80-90లో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఎలా పెరిగిందో అదే విధంగా తెలంగాణలో కూడా జరుగుతోందని ప్రధాని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని అన్నారు. ఇక్కడ ప్రజలు తక్కువ సయమంలోనే ప్రజలు నిరాశలో పడిపోయారని అన్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ భారీ బహుమతి ఇచ్చిందని, కానీ వాళ్లు మాత్రం మేం రాజులం, ఏమీ చేయం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌పై కోపం కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అయిందని అన్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వింటున్నానని, ఈ సంగతి విని నేను ఆశ్చర్యాపోయానని, తాను ఆర్ ఆర్ ట్యాక్స్ అన్నాను కానీ ఎవరి పేరూ చెప్పలేదని, వాళ్లెందుకు అలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.
Read Also: Narendra Modi : నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.. మానసికంగా రాముడికే అంకితమయ్యాను
Also Read
తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. మాది దేశం మొత్తం ఒకటే విజన్ అని, 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రం కలిపి ఒకే దిశలో వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రయాణించాలని అన్నారు. తెలంగాణలో పుష్కలంగా వనరులు ఉన్నాయని అన్నారు. గతంలో ముంబై, కలకత్తా, ఢిల్లీ, చెన్నై నగరాల పేర్లు మాత్రమే వినిపించేవని, ప్రస్తుతం బెంగళూర్, హైదరాబాద్ పేర్లు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణలో వీలైనంత వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో రైతుల జీవితాలు మెరుగపడాలని అన్నారు. తెలుగు రాష్ట్రాలను పారిశ్రామికంగా వృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ పాలకడు ఆ దిశగా ఆలోచించాలని చెప్పారు. తెలంగాణలో ఐదారు పట్టణాలను ఆధునికంగా తీర్చిదిద్దవచ్చని, హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చవచ్చని చెప్పారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో చేయడానికి చాలా స్కోప్ ఉందని చెప్పారు. నేషనల్ హైవేలను ఆరు లైన్లుగా మారుస్తున్నామని, హైదారాబాద్‌కి వందేభారత్ రైలు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేశాన్ని ఫార్మాసీ హబ్‌గా మార్చడానికి హైదరాబాద్‌కి చాలా అవసరమని అన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు