వన్ కళ్యాణ్ తో తనకు ఎలాంటి వ్యక్తి గత గొడవలు లేవని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పవన్ భార్య గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఈ రోజు ఎన్టీవీలో నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో జర్నలిస్టులు సంధించి ప్రశ్నలకు మాజీ మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు.
ఏపీలో ఈరోజు నామినేషన్ల స్క్రూట్నీై: ఏపీలో ఈరోజు నామినేషన్ల స్క్రూట్నీై (నామినేషన్ల పరిశీలన) జరగనుంది. ఏపీ వ్యాప్తంగా లోక్‌సభ సెగ్మెంట్లకు 1102, అసెంబ్లీ సెగ్మెంట్లకు 5960 మేర నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇండిపెండెంట్లు, డమ్మి అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు రెండు, మూడేసి సెట్లు దాఖలు చేశారు. వచ్చిన నామినేషన్ల సెట్లను నేడు ఎన్నికల అధికారులు పరిశీలన చేయనున్నారు. స్క్రూట్నీ తర్వాత నామినేషన్లు తగ్గనున్నాయి. స్క్రూట్నీలో ఒకే అయ్యాక డమ్మి అభ్యర్థులు నామినేషన్లను…
నేడు సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్‌ను రెండో రోజు విచారించనున్నారు. పోలీసులు తమ కస్టడీలో సతీష్‌ను ప్రశ్నలు అడగనున్నారు. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు నామినేషన్ల పరిశీలన జరగుతుంది. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నేడు మెదక్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పెద్ద శంకరంపేటలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈరోజు ఉదయం…
ఈరోజు ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎంతో సేవ చేశానని తెలిపారు. ఎన్నికల్లో ఎవరో చెబితో ప్రజలు ఓట్లు వేయరు.. వారికి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేస్తారన్నారు. అది ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఎంతో చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు…
అన్నదమ్ముల సంగ్రామంలో తుని టీడీపీ నలిగిపోతోందా? ఇన్నాళ్ళు అన్న చాటు రాజకీయం చేసిన తమ్ముడు ఇక హ్యాండిచ్చేసినట్టేనా? కీలకమైన టైంలో యనమల కృష్ణుడు పత్తా లేకుండా పోవడాన్ని ఎలాచూడాలి? ఉక్కపోత భరించలేని తమ్ముళ్ళు ఫ్యాన్ కిందికి చేరుతున్నది నిజమేనా? కృష్ణుడు లేని కురుక్షేత్రం అంటూ సోషన్ మీడియా పోస్టింగ్స్ వెనక ఉద్దేశ్య ఏంటి? తుని తెలుగుదేశం పార్టీలో మంటలు మండిపోతున్నాయట. పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమైపోయారు సీనియర్ లీడర్, యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు. పార్టీకి, వ్యక్తిగతంగానూ……
బీఆర్ఎస్కు ఇప్పుడు ఎమ్మెల్యేల భయం పెరుగుతోందా? గంపగుత్తగా కారు దిగేసి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతోందా? అంతదాకా రాకుండా ముందే కొత్త రకం అస్త్రంతో మైండ్ గేమ్ మొదలైందా? ఇంతకీ ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ ప్రయోగించాలనుకుంటున్న అస్త్రం ఏంటి? పార్టీ ప్లాన్ ఎలా ఉంది? అసెంబ్లీ ఎన్నికల్లో టైం బ్యాడై, రాశి ఫలాలు తిరగబడి…. జనం తిరస్కరించి… 39 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం అయింది బీఆర్ఎస్. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో మూడోసారి అధికారానికి…
తెలంగాణ బీజేపీలోని ఆ ఇద్దరు ముఖ్యులకు తత్వం బోథపడిందా? అసెంబ్లీ ఎన్నికల టైంలో హెలికాప్టర్స్ వేసుకుని తిరిగి మరీ నానా హంగామా చేసిన నేతలు ఇప్పుడెందుకు నియోజకవర్గం దాటి బయటికి రావడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ ఉన్నా… యాక్ట్ లోకల్ అన్నట్టుగానే వ్యవహారం ఉంది ఎందుకు? ఇంతకీ… ముందు ఇంట గెలవాలనుకుంటున్న ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళ మారు మనసుకు కారణాలేంటి? అసెంబ్లీ ఎన్నికల అనుభవాలతో లోక్‌సభ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోంది తెలంగాణ బీజేపీ.…
మేం అట్టా ప్లాన్ వేయగానే…. అవతలోళ్ళకి ఇట్టా ఎట్టా తెలిసిపోతోంది? పక్కనే ఉంటూ వెన్నుపోట్లు పొడిచే బ్యాచ్ ఎక్కువైపోతోందా అని తెగ టెన్షన్ పడుతున్నారట ఆ ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు. పైకి అంతా మనోళ్ళే అనిపిస్తున్నా… ఎవర్ని ఎంత వరకు నమ్మాలో అర్ధంగాక బుర్రలు గోక్కుంటున్నారట. నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ జిల్లాలో ఉన్నారు? ఏంటా కథ? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు అత్యంత సన్నిహితులను చూసినా భయపడుతున్నారట.…
అసెంబ్లీ ఎన్నికల్లోకి ఫ్రషర్గా ఎంటరై మహామహుల్ని మట్టికరిపించిన చరిత్ర ఆ ఎమ్మెల్యేది. కానీ… ఇప్పుడాయనకు అంతకు మించిన అగ్ని పరీక్ష ఎదురవబోతోంది. అప్పుడు కాదు… ఇప్పుడు చూపించు నీ సత్తా అంటూ సవాల్ విసురుతున్నారు రాజకీయ ప్రత్యర్థులు. నీ జెయింట్ కిల్లర్ మేజిక్ ఏంటో చూస్తామంటూ తొడగొడుతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ విషయంలో ఆయనకు సవాళ్ళు ఎదురవుతున్నాయి? ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా మారిందట కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి…
తెలుగుదేశం పార్టీలో అసమ్మతులు, అసంతృప్తులు కంప్లీట్‌గా చల్లారిపోయినట్టేనా? అందరికీ జిందా తిలిస్మాత్లాగా… కలిసి పనిచేయండని చంద్రబాబు ఒక్క మాట చెప్పగానే… ఆల్ సెట్ అయిపోయిందా? పార్టీ పెద్దలు నమ్ముతున్నదేంటి? క్షేత్ర స్థాయిలో జరుగుతున్నదేంటి? అమరావతిలో ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్ళడం మినహా మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్న వాదనలో నిజమెంత? ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్స్కుగాను 31 నియోజకవర్గాలను పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించింది టీడీపీ. ఇక మరో 30కు పైగా సెగ్మెంట్లల్లో టిక్కెట్ ఆశించి…