Modi-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు మోడీ ఫోన్.. యుద్ధంపై సంభాషణ
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు మోడీ ఫోన్
- మధ్యప్రాచ్యం సంక్షోభంపై సంభాషణ
- దౌత్యానికి రావాలని మోడీ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యం సంక్షోభం వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. యుద్ధం విషయంలో దౌత్యానికి మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పేర్కొన్నారు.
గత ఐదు రోజులుగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమయ్యాడు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. గల్ఫ్ దేశాల్లో భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో గల్ఫ్ దేశాధినేతలకు మోడీ ఫోన్ చేసి ఖండించారు.
Also Read
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ఫోన్ చేసి యుద్ధం ముగింపునకు దౌత్యం నిర్వహించాలని కోరారు. ‘‘ఈ రోజు నా స్నేహితుడు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడాను. పశ్చిమాసియా పరిస్థితి, చర్చలు, దౌత్యానికి సంబంధించి మా ఉమ్మడి ఆందోళనలను చర్చించాం. శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి మేము దగ్గరగా పాల్గొనడం, ప్రయత్నాలను సమన్వయం చేయడం కొనసాగిస్తాం.’’ అని రాసుకొచ్చారు. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ సంభాషణ జరిగిందని.. ప్రపంచ నాయకులు సంయమనం, దౌత్యపరమైన చర్చలకు మోడీ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: IPL 2026 Schedule : ఐపీఎల్ షెడ్యూల్ ముక్కలు ముక్కలుగా ఎందుకు వస్తోంది.? షాకింగ్ రీజన్స్.!
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయి. దీంతో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు చనిపోయారు. అనంతరం ఇరాన్ కూడా ప్రతీకారంగా దాడులకు దిగింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Spoke with my friend President Emmanuel Macron today. We discussed our shared concerns over the evolving situation in West Asia and the need for a return to dialogue and diplomacy. We will continue to engage closely and coordinate efforts towards the early restoration of peace…
— Narendra Modi (@narendramodi) March 5, 2026
తాజావార్తలు
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!