Off The Record : జూబ్లీహిల్స్ లో ప్లస్, మైనెస్ లపై కాంగ్రెస్ లో చర్చ
- జూబ్లీహిల్స్‌లో ప్లస్, మైనస్‌లపై కాంగ్రెస్‌లో చర్చ
- మూడు నెలల ముందే ముగ్గురు మంత్రులకు బాధ్యతలు
- సరిగా వర్కౌట్ చేయలేదన్న ఫీలింగ్, డైరెక్ట్‌గా రంగంలోకి సీఎం
- సీఎం దిగాకే గెలుపు ధీమా వచ్చిందన్న టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే…. ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి? ఒకవేళ తేడా పడితే బద్నాం అయ్యేది ఎవరు? చివర్లో డైరెక్ట్‌గా రంగంలోకి దిగిపోయి అంతా తానై నడిపిన సీఎం రేవంత్‌రెడ్డి గురించి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయన ఎక్కడ దొరుకుతాడా అని కాచుక్కూర్చున్న పార్టీలోని ఓ వర్గం ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీనియర్స్ సహా… నాయకులు అందర్నీ గల్లీ గల్లీ తిప్పింది. అన్ని రకాల వనరులను సమకూర్చి… గెలుపు మాత్రమే కనిపిస్తోందన్నట్టుగా యుద్ధం చేసింది. అంతవరకు బాగానే ఉన్నా….ఇప్పుడు పార్టీ అభ్యర్థి గెలిస్తే… క్రెడిట్ ఎవరికి? తేడా పడితే… బద్నాం అయ్యేది ఎవరన్న చర్చ జోరుగా జరుగుతోంది పార్టీ వర్గాల్లో. జూబ్లీహిల్స్‌లో పార్టీ కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చిందన్న అభిప్రాయం ఉంది. బరిలో ఉన్న ప్రత్యర్థులు కూడా చెమటోడ్చారు.
దాంతో ఫైట్ టైట్ అయిందన్న విశ్లేషణలున్నాయి. మూడు నెలల ముందు నుంచే… ముగ్గురు మంత్రులకు ఉప ఎన్నిక బాధ్యత అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ… వాళ్ళు ఆశించిన స్థాయిలో వర్కవుట్ చేయలేకపోయారనే ఫీలింగ్ పార్టీ పెద్దల్లో ఉందట. ఇక ఆ తర్వాత నేరుగా రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి…. డివిజన్స్ వారీగా మంత్రులకు బాధ్యతలు ఇవ్వడం, ఆయనే స్వయంగా పర్యవేక్షించడంతోపాటు క్షేత్ర స్థాయిలో రోడ్ షోలు నిర్వహించారు. ప్రతి100 మంది ఓటర్స్‌కు ఒక నాయకుడిని కేటాయించి పని చక్కబెట్టారు. ఇక ఆ తర్వాతి నుంచే… కాంగ్రెస్ కేడర్, లీడర్స్‌లో గెలుపు ధీమా వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడిక గెలుస్తామా లేదా అన్న మీమాంస నుంచి గెలుపు గ్యారంటీ… మెజార్టీ గురించే మాట్లాడుకుందామనేలా పరిస్థితి మారిపోయిందంటే… అందుకు CM రేవంత్ చొరవే కారణమన్న టాక్ నడుస్తోంది కాంగ్రెస్ వర్గాల్లో.
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
అలాగే…. ఆయన బాధ్యతలు అప్పగించిన వారిలో మెజారిటీ నేతలు గ్రౌండ్‌లో సమర్ధవంతంగా పరిస్థితిని చక్కబెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అన్ని రకాలుగా మంత్రుల్ని సమన్వయ పరుస్తూ వచ్చారు. ఇక పోల్ మేనేజ్మెంట్ విషయంలో గతంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ నేతలు మంచి సమన్వయంతో పని చేశారు. అందుకే గెలుపు గ్యారంటీ ధీమా పెరిగిపోయిందని అంటున్నారు. అదే సమయంలో ఫలితం తేడా కొడితే…… అంతా ఆయనే చేశారంటూ సీఎంని ఎత్తిపొడవడానికి కాంగ్రెస్‌సో కొంత మంది నేతలు కాచుక్కూర్చున్నారు. కానీ… పోలింగ్ సరళి, ఎగ్జిట్‌పోల్స్‌తో అలాంటి వాళ్ళంతా బాగా డిజప్పాయింట్ అయ్యారట.
ప్రస్తుతం వాతావరణం కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించేలా ఉండటంతో.. అన్నీ తానై నడిపిన సీఎం రేవంత్‌రెడ్డికే క్రెడిట్ దక్కుతుందని మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇదే సమయంలో భారీ మెజార్టీ వస్తే మాత్రం ఆయనకు వెయ్యి ఏనుగుల బలం తోడవుతుందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, పార్టీ పరంగా చాలా సవాళ్ళు ఉన్నాయి కాబట్టి…వాటిని సెట్ చేసుకునే అవకాశం జూబ్లీహిల్స్ బైపోల్ ద్వారా వచ్చిందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. జూబ్లీహిల్స్ క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి ఖాతాలోకే వెళ్తుందని అంచనా వేస్తున్న పార్టీ లీడర్స్… అనుకున్న మెజార్టీ వస్తే మాత్రం ప్రభుత్వంలో భారీ మార్పులే ఉండవచ్చని లెక్కలేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!