స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేయడం లేదా? ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటోందా? అధికారంలో ఉండి కూడా రిస్క్ అనుకోవడం వెనక రీజనేంటి? ఏ విషయంలో హస్తం పార్టీ వెనక్కి తగ్గుతోంది? ఎక్కడ జరగబోతోందా ఎన్నిక? తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల టైం దగ్గర పడుతోంది. ఏప్రిల్ 4 తో నామినేషన్ గడువు ముగుస్తుంది. ప్రత్యేకించి ఇది జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్సీ సీటు కావడంతో… అన్ని వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. బరిలో నిలిచేది ఎవరు……
ఒక నాయకుడి కక్కుర్తి నియోజకవర్గం మొత్తం మీద జనసేనను డిఫెన్స్‌లో పడేసిందా? జనం అడిగే ప్రశ్నలకు నాయకులు సమాధానం చెప్పుకోలేకపోతున్నారా? వరద బాధితుల కోసం సేకరించిన బియ్యాన్ని అమ్ముకున్న ఆ పార్టీ నేత ఎవరు? నిలదీస్తే ఇప్పుడు పార్టీకి విరాళం ఇస్తాననడాన్ని ఎలా చూడాలి? పార్టీ పరువును నిలువునా బజారుకీడ్చిన ఆ నేత విషయంలో అధిష్టానం వైఖరేంటి? నిరుడు వరదలు విజయవాడను అల్లకల్లోలం చేసేశాయి. ఆపదలో ఉన్న బాధితులకు అండగా మేం ఉంటామంటూ… పెద్ద ఎత్తున దాతలు…
తెలంగాణలో ఇక మీదట కక్ష సాధింపు రాజకీయాలు ఉండవా? అసెంబ్లీ వేదికగా ఆ ప్రకటన చేసి సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రత్యేక సందేశం పంపారా? అసలు సభ సాక్షిగా ఆ ప్రకటన చేయడాన్ని ఎలా చూడాలి? రేవంత్‌రెడ్డి దూకుడు తగ్గించుకున్నారా? లేక వ్యూహం మార్చారా? ఆయన మాటల వెనక శ్లేషలు దాగున్నాయా? ఆ విషయమై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇక కక్ష సాధింపు చర్యలు ఉండవంటూ… సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన కామెంట్స్…
ఎమ్మెల్యే కొలికపూడి టీడీపీ అధిష్టానానికి కొరుకుడు పడటం లేదా? ఏకంగా పార్టీకే డెడ్‌లైన్ పెట్టి అల్టిమేటమ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఆయన ఇన్నాళ్ళు చేసిన రచ్చ ఒక ఎత్తు, తాజా వివాదం మరో ఎత్తులా ఉండబోతోందా? ఎమ్మెల్యే వాఖరి మీద పార్టీ పెద్దలు సీరియస్‌గానే ఉన్నారా? తిరువూరు ఎమ్మెల్యే గురించి టీడీపీలో ఏమని మాట్లాడుకుంటున్నారు? ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి ఆందోళనల్లో చురుగ్గా పాల్గొనడం, ఎగ్రెసివ్ నేచర్‌తో సీఎం చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు కొలికపూడి శ్రీనివాస్.…
బీఆర్ఎస్లో కొత్తగా అత్యున్నత స్థాయి పోస్ట్ ఒకటి క్రియేట్ కాబోతోందా? పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్ళేందుకు వీలుగా ఆ పదవి రెడీ అవుతోందా? ముఖ్య నేత ఒకరు ఆ పార్టీ పదవీ బాధ్యతల కోసం ఉవ్విళ్ళూరుతున్నారా? దాని గురించి ఇప్పటికే కేసీఆర్ దగ్గర చర్చ జరిగిందా? అసలే పోస్ట్ గురించి ఈ చర్చ అంతా? ఎవరా నేత? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇక దూకుడు పెంచాలని భావిస్తోందట బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినందున ప్రభుత్వ వైఫల్యాలపై…
అవును వాళ్ళు కలిసిపోయారు….. మనసులు, చేతులైతే కలిశాయి. ఇక చేతల్లో చూడాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరు కలిసినా ఇలాగే మాట్లాడుకుంటున్నారట. ఒకప్పుడు ఆ లీడర్ మా జిల్లాలోకి అడుగుపెట్టడానికే వీల్లేదు. మా సంగతి మేం చూసుకోగలం. ఆ దమ్ము మాకుందని బీరాలు పలికిన లీడర్స్ ఇప్పుడు మాత్రం ఆయన్ని రా…. రమ్మని పిలుస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా పిలుపుల పాలిటిక్స్? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,…శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. అందుకు ఉదాహరణలు కూడా…
ఆ టీడీపీ సీనియర్‌కి నిన్నటిదాకా పూల కిరీటం అనుకున్న పదవే ఇప్పుడు ముళ్ళ కిరీటంలా మారిపోయిందా? దాని ఎఫెక్ట్‌తో ఆయన కుర్చీలో కూడా సరిగా కూర్చోలేకపోతున్నారా? ఇంట గెలవడం ఆయనకు ఇప్పుడు అత్యవసరం అయిపోయిందా? తప్పించుకుందామనుకున్నా…. వదలకుండా వెంటబడ్డ వ్యవహారం ఆయన్ని పరేషాన్ చేస్తోందా? ఎవరా లీడర్? ఏంటాయన సీటు కిందికొచ్చిన కష్టం? పల్లా శ్రీనివాసరావు….ఏపీ టీడీపీ అధ్యక్షుడు. గాజువాక నుంచి 95వేల మెజారిటీతో గెలిచారాయన. బీసీ కార్డ్, విధేయత కలిసి మంత్రి అయిపోతారనే ప్రచారం జరిగినా….అంతకు మించిన గౌరవం…
అక్కడ కాంగ్రెస్ పార్టీకి లీడర్స్ ఫుల్లుగా ఉన్నారు. కానీ… కేడర్ని నడిపే దిక్కు మాత్రం లేదు. నలుగురు నాయకులు పార్టీ టిక్కెట్ కోసం పోటీలు పడ్డారు. కానీ… ఇప్పుడు వాళ్ళలో ఒక్కరూ కనిపించడం లేదు. పైగా అప్పట్లో హంగామాగా ఎవరికి వారు ఓపెన్ చేసిన ఆఫీస్‌ల అడ్రస్‌లు ఇప్పుడు గల్లంతైపోయాయి. పార్టీ పవర్లో ఉన్నా…. అక్కడ ఎందుకా పరిస్థితి ఉంది? అసలేదా సెగ్మెంట్? కాంగ్రెస్ పార్టీకి మొదట్నుంచి కంచుకోట భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం. అడపా దడపా…
ఒకప్పుడు హాట్ హాట్ పాలిటిక్స్‌కు కేరాఫ్ ఆయన. ఇప్పుడు మాత్రం అంతా రామ మయం అంటూ… భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. పండగ ఏదైనా సరే… మన బ్రాండ్ ఉండాల్సిందేనంటూ గ్రాండ్‌గా జరిపించేస్తున్నారు? రాజకీయాలు వదిలేసి రామ భజన చేస్తున్న ఆ నాయకుడెవరు? మార్పు వెనక మర్మం ఏంటి? మాజీ ఎమ్మెల్యే, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ ట్యాగ్ లైన్స్ కూడా ఉన్నాయి ఆయనకు. పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి…
ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వ్యవహారం అక్క పెత్తనం- చెల్లెలి కాపురంలా మారిపోయిందా? ఎమ్మెల్యే పదవి ఒక పార్టీది అయితే…. మరో పార్టీ నాయకులు పవర్ సెంటర్స్‌గా మారిపోయారా? మనం జస్ట్…. పేరుకు ఎమ్మెల్యేలుగా, ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోవాల్సిందేనా అని వాళ్ళంతా మధనపడుతున్నారా? మెల్లిగా అది బ్లాస్టింగ్ స్టేజ్‌కు చేరుకుంటోందా? ఎక్కడుందా పరిస్థితి? ఎవరా ఎమ్మెల్యేలు? అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అత్యధికంగా సీట్లు సాధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళ పరిస్థితి గందరగోళంగా ఉందా అంటే……