అధికారం చేతిలో ఉన్నప్పుడు అంతన్నాడింతన్నాడు. నా అంతటోళ్ళు లేరన్నాడు. రాజకీయ ప్రత్యర్థుల మీదికి తొడగొట్టాడు. మీసం మెలేశాడు…. కట్ చేస్తే ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయారా మాజీ మంత్రి. దాంతో వేషాలన్నీ పవర్ ఉన్నప్పుడేనా? అంతా గాలి బుడగ సామెతేనా అంటూ సెటైర్స్ పడుతున్నాయట. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏంటా కహానీ? నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. కార్పొరేటర్‌గా ఉన్న తన బాబాయ్ చనిపోవడంతో……
ఒకప్పుడు ఆ పదవి తీసుకోమంటే…. అబ్బా… ఇప్పుడొద్దులే, చూద్దాంలే, చేద్దాంలే అంటూ ఎక్కడలేని సణుగుళ్ళూ సణిగిన నేతలంతా ఇప్పుడు పోటీ పడుతున్నారట. పైగా మాకంటే మాకంటూ పైరవీలు సైతం మొదలుపెట్టేశారట. అప్పట్లో ఎవరో ఒకరులే అనుకున్న టీడీపీ అధిష్టానం సైతం…. ఇప్పుడు ఆచితూచి అన్నట్టుగా ఉందట. ఉన్నట్టుండి అంతలా కాంపిటీషన్ పెరిగిపోయిన ఆ పదవి ఏది? ఎందుకు ఒక్కసారిగా అలా డిమాండ్ పెరిగిపోయింది? తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోందట. ఇన్నాళ్ళు రాష్ట్ర పార్టీ బాధ్యతలు…
రెండు విడతలుగా పోటీకి దూరంగా ఉంటున్నా…, పార్టీ కోసమే ప్రచారం చేస్తున్నా….. ఆ సీనియర్ లీడర్ని టీడీపీ అధిష్టానం లైట్ తీసుకుంటోందా? ఆయన పార్టీలోకి వచ్చేటప్పుడు ఇచ్చిన హామీల్ని సైతం మర్చిపోయిందా? అందరికీ పదవులు ఇస్తున్నా… ఆయన్ని మాత్రం ఎందుకు పట్టించుకోలేదు? స్వయంగా చంద్రబాబు ఇచ్చిన హామీ ఎందుకు అమలవడం లేదు? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా ల్యాగింగ్ స్టోరీ? వంగవీటి రాధా…మాజీ ఎమ్మెల్యేగా కంటే దివంగత నాయకుడు వంగవీటి రంగా కుమారుడిగానే ఆయనకు ఎక్కువ గుర్తింపు…
ఆ నియోజకవర్గంలో మర్డర్ పాలిటిక్స్ మళ్లీ మొదలయ్యాయా? కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు హత్యలదాకా వెళ్ళిందా? పొలిటికల్ పైచేయి కోసం ఖద్దర్, ఖాకీ ఒక్కటయ్యాయా? చనిపోయిన నాయకుడు, చంపినట్టు ఆరోపణలున్న నాయకుడు సొంత మామా అల్లుళ్ళే అయినా….. పొలిటికల్ పవర్ ముందు బంధం బలాదూర్ అయిందా? ఎక్కడ జరిగిందా హత్య? కాంగ్రెస్‌ని ఎలా షేక్ చేస్తోంది? సూర్యాపేట జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ హత్య హస్తం పార్టీలో కుంపటి రాజేసింది. అది పోలీస్ డిపార్ట్మెంట్కు కూడా అంటుకోవడం మరింత…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేయడం లేదా? ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటోందా? అధికారంలో ఉండి కూడా రిస్క్ అనుకోవడం వెనక రీజనేంటి? ఏ విషయంలో హస్తం పార్టీ వెనక్కి తగ్గుతోంది? ఎక్కడ జరగబోతోందా ఎన్నిక? తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల టైం దగ్గర పడుతోంది. ఏప్రిల్ 4 తో నామినేషన్ గడువు ముగుస్తుంది. ప్రత్యేకించి ఇది జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్సీ సీటు కావడంతో… అన్ని వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. బరిలో నిలిచేది ఎవరు……
ఒక నాయకుడి కక్కుర్తి నియోజకవర్గం మొత్తం మీద జనసేనను డిఫెన్స్‌లో పడేసిందా? జనం అడిగే ప్రశ్నలకు నాయకులు సమాధానం చెప్పుకోలేకపోతున్నారా? వరద బాధితుల కోసం సేకరించిన బియ్యాన్ని అమ్ముకున్న ఆ పార్టీ నేత ఎవరు? నిలదీస్తే ఇప్పుడు పార్టీకి విరాళం ఇస్తాననడాన్ని ఎలా చూడాలి? పార్టీ పరువును నిలువునా బజారుకీడ్చిన ఆ నేత విషయంలో అధిష్టానం వైఖరేంటి? నిరుడు వరదలు విజయవాడను అల్లకల్లోలం చేసేశాయి. ఆపదలో ఉన్న బాధితులకు అండగా మేం ఉంటామంటూ… పెద్ద ఎత్తున దాతలు…
తెలంగాణలో ఇక మీదట కక్ష సాధింపు రాజకీయాలు ఉండవా? అసెంబ్లీ వేదికగా ఆ ప్రకటన చేసి సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రత్యేక సందేశం పంపారా? అసలు సభ సాక్షిగా ఆ ప్రకటన చేయడాన్ని ఎలా చూడాలి? రేవంత్‌రెడ్డి దూకుడు తగ్గించుకున్నారా? లేక వ్యూహం మార్చారా? ఆయన మాటల వెనక శ్లేషలు దాగున్నాయా? ఆ విషయమై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇక కక్ష సాధింపు చర్యలు ఉండవంటూ… సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన కామెంట్స్…
ఎమ్మెల్యే కొలికపూడి టీడీపీ అధిష్టానానికి కొరుకుడు పడటం లేదా? ఏకంగా పార్టీకే డెడ్‌లైన్ పెట్టి అల్టిమేటమ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఆయన ఇన్నాళ్ళు చేసిన రచ్చ ఒక ఎత్తు, తాజా వివాదం మరో ఎత్తులా ఉండబోతోందా? ఎమ్మెల్యే వాఖరి మీద పార్టీ పెద్దలు సీరియస్‌గానే ఉన్నారా? తిరువూరు ఎమ్మెల్యే గురించి టీడీపీలో ఏమని మాట్లాడుకుంటున్నారు? ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి ఆందోళనల్లో చురుగ్గా పాల్గొనడం, ఎగ్రెసివ్ నేచర్‌తో సీఎం చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు కొలికపూడి శ్రీనివాస్.…
బీఆర్ఎస్లో కొత్తగా అత్యున్నత స్థాయి పోస్ట్ ఒకటి క్రియేట్ కాబోతోందా? పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్ళేందుకు వీలుగా ఆ పదవి రెడీ అవుతోందా? ముఖ్య నేత ఒకరు ఆ పార్టీ పదవీ బాధ్యతల కోసం ఉవ్విళ్ళూరుతున్నారా? దాని గురించి ఇప్పటికే కేసీఆర్ దగ్గర చర్చ జరిగిందా? అసలే పోస్ట్ గురించి ఈ చర్చ అంతా? ఎవరా నేత? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇక దూకుడు పెంచాలని భావిస్తోందట బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినందున ప్రభుత్వ వైఫల్యాలపై…
అవును వాళ్ళు కలిసిపోయారు….. మనసులు, చేతులైతే కలిశాయి. ఇక చేతల్లో చూడాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరు కలిసినా ఇలాగే మాట్లాడుకుంటున్నారట. ఒకప్పుడు ఆ లీడర్ మా జిల్లాలోకి అడుగుపెట్టడానికే వీల్లేదు. మా సంగతి మేం చూసుకోగలం. ఆ దమ్ము మాకుందని బీరాలు పలికిన లీడర్స్ ఇప్పుడు మాత్రం ఆయన్ని రా…. రమ్మని పిలుస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా పిలుపుల పాలిటిక్స్? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,…శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. అందుకు ఉదాహరణలు కూడా…