సీల్డ్ కవర్లో డబ్బులు దండుకుంటున్న డాక్టర్లు: చీకటి వ్యాపారంలో మునిగి తేలుతున్న డాక్టర్ల అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో స్కానింగ్ మాఫియాతో డాక్టర్లు చేతులు కలిపారు. ల్యాబ్, స్కానింగ్, ఎక్స్‌రేలను ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లకు రాసి.. సీల్డ్ కవర్లో డబ్బులు తీసుకొంటున్నారు. లక్షల్లో ప్రభుత్వ సొమ్మును జీతాల రూపంలో తీసుకుంటున్న మదనపల్లె డాక్టర్లకు ఇది ఓ వ్యసనంగా మారింది. రోగులకు వైద్యం చేయాల్సింది మరచి.. అదే రోగులతోనే మూడు పువ్వలు ఆరు కాయలుగా డాక్టర్ల…
అన్ని కులాలు అండగా ఉన్నాయి: అన్ని కులాలు మద్దతిస్తేనే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించిందని, సీఎం చంద్రబాబు నాయుడుకు అన్ని కులాలు అండగా ఉన్నాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కులం ఆపాదించిన నీచుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్ని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం వస్తే జైలులో వేస్తాం అని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై…
తెలుగు రాష్ట్రాల్లో వానలు: ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా కొన్నిచోట్ల పడ్డాయి. శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహా సముద్రం మీదుగా ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రోజు ముగిసేనాటికి అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడనం…
అభివృద్ధి అంతకంటే లేదు: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యిందని.. ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, అభివృద్ధి అంతకంటే లేదని కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, పాలన అనేదే లేకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో తమ ప్రభుత్వం పరిహారం అందించిందని, ఇప్పుడు పంట నష్టపోయినా…
భక్తులతో కిటకిటలాడుతున్న గోదావరి స్నానఘట్టాలు: కార్తిక మాసంలో వచ్చే చివరి రోజును పోలి పాడ్యమి (పోలి స్వర్గం) అంటారు. ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరించి.. చెరువులు, నదులలో దీపాలు వదులుతారు. అదే సమయంలో పోలి కథను కూడా చదువుకుంటారు. నేడు పోలి పాడ్యమి కావడంతో రాజమండ్రిలోని గోదావరి స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోదావరిలో పోలి పాడ్యామి స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో రాజమండ్రిలోని పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి…
దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు: టీడీపీ కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై మంత్రి నారా లోకేశ్ భావోద్వేగ పోస్టు చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే శ్రీను.. తనకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి…
కోడిగుడ్డు రేటూ పెరుగుతోంది: గత కొన్ని నెలలుగా కూరగాయలు ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. కిలో టమాటా ధర రూ.35-40గా కొనసాగుతోంది. మిగతా కూరగాయలు రూ.30-50గా ఉన్నాయి. ఇది చాలదన్నట్టు మరోవైపు కోడిగుడ్డు రేటూ రోజురోజుకూ పెరిగిపోతోంది. హోల్ సేల్ మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.90గా ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో దాదాపుగా రూ.7గా పలుకుతోంది. ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.80గా ఉంది. దాంతో కోడిగుడ్డు కొనాలన్నా సామాన్య ప్రజలు ఆలోచించాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో…
ఎవరైనా తప్పించుకోలేరు: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచిందని, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వ నాయకులు ఐదేళ్లలో చాలా దారుణాలు చేశారన్నారని, ఆరోజు మూగబోయిన గొంతులు ఈరోజు వస్తున్నాయన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా, ఎంతటి హోదాలో ఉన్నా తప్పించుకోలేరని హెచ్చరించారు. వైసీపీ నాయకులు నష్ట నివారణ కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని మంత్రి డోలా ఎద్దేవా చేశారు. సోదరుడి…
రాజ్యసభకు నాగబాబుకు: సినీ నటుడు, జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు.. రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బీజేపీ పెద్దలతో జనసేన రాజ్యసభ సీటుపై చర్చించారట. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరారట. అందుకు బీజేపీ పెద్దలు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం అని సమాచారం. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన: దక్షిణ…
స్టేషన్లోనే సెటిల్మెంట్: శ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు మాఫీ కోసం పోలీసులు వాటాలు పంచుకున్నారు. వివరాల ప్రకారం… తణుకు మండలం వేల్పూర్‌లో ఆకుల మారుతి రావుకు గేదెల ఫామ్ ఉంది. ఇటీవల ఫామ్‌లో రెండు గేదెలను ఇద్దరు వ్యక్తులు దొంగలించారు. ఈ విషయం గురించి తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో మారుతి రావు ఫిర్యాదు చేశారు. గేదెలను దొంగిలించిన ఇద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. కేసు మాఫీకి 12 లక్షల రూపాయలకు దొంగలతో…