మహారాష్ట్రలో ఓ టీనేజ్ బాలిక తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయేందుకు ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడింది. చివరకు పోలీసు విచారణలో అసలు విషయం తెలిసింది. వివరాల్లోకి వెళ్తే పాల్ఘర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక కిడ్నాప్ తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయేందుకు కట్టకథను అల్లింది. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. పాల్ఘర్ లోని విరార్ ప్రాంతంలో నివసిస్తున్న బాలిక, స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తుంది.
PM Modi: 1947లో పాకిస్థాన్ మతం పేరుతో ప్రత్యేక దేశంగా అవతరించింది. భారత్‌ను శత్రువుగా అంగీకరించింది. సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేసినా అలాంటి మంచి అవకాశం రాలేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు పాక్ ప్రధాని జనరల్ పర్వేజ్ ముషారఫ్‌తో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రయత్నించారు.
Mexico : ఉత్తర అమెరికాలోని మెక్సికోలో భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది రోడ్డు రేసర్లు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం కార్ షోలో కాల్పులు జరిగాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో కాల్పులు జరిగినట్లు ప్రాథమిక సమాచారం.