నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. మంత్రి నారా లోకేష్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి నారావారిపల్లెకు తరలిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. తల్లిదండ్రులు అమ్మనమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి: క్యాపిటల్ జోన్ ప్రాపర్టీ షో బ్రోచర్…
మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం: మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీశాఖలో ఎలాంటి సంస్కరణలకైనా తాను సహకరిస్తానని.. అదనపు నిధులు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తీసుకువస్తానన్నారు. తనకు చిన్నప్పటి నుంచి అటవీశాఖ అంటే ఎంతో గౌరవం అని, అటవీశాఖలో అమరులైన 23 మందిని చరిత్ర తలుచుకునే లాగా ఏర్పాటు చేస్తామని పవన్ చెప్పారు. నేడు గుంటూరులో జరిగిన అటవీశాఖ…
కోటి దీపోత్సవం రెండో రోజు కార్యక్రమాలు ఇవే: కోటి దీపోత్సవం 2024లో నేడు రెండో రోజు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ (శ్రీ సిద్ధేశ్వరీ పీఠం, కుర్తాళం), రమ్యానంద భారతి మాతాజీ (శ్రీ శక్తిపీఠం, తిరుపతి) గారిచే అనుగ్రహ భాషణం ఉంటుంది. శ్రీ నండూరి శ్రీనివాస్ గారు ప్రవచనామృతం చేయనున్నారు. వేదికపై నర్మదా బాణలింగానికి కోటి భస్మార్చన, భక్తులచే స్వయంగా శివలింగాలకు కోటి భస్మార్చన, కోటి దీపోత్సవం వేదికపై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణం ఉంటుంది.…
నేడు గుంటూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పవన్ గుంటూరు చేరుకోనున్నారు. నగరం పాలెంలోని అరణ్య భవన్‌లో అటవీ అమరవీరుల సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ నందు APMSA స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి వరకు పలు కార్యక్రమాలలో మంత్రి కందుల…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి తీరం కంపు కొడుతుందని ఎన్టీవీలో ప్రసారమైన వార్తకు గ్రామపంచాయతీ అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు.