ఏ కూటమిలో చేరే ఆలోచన మాకు లేదు: ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని, తమది న్యూట్రల్ స్టాండ్ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇండియా కూటమి, ఎన్డీఏలకు తాము సమాన దూరం అని పేర్కొన్నారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ మీద పార్టీ అధ్యక్షుడు ఆలోచనలకు అనుగుణంగా జీపీసీ ఎదుట తమ అభిప్రాయం చెబుతాంని చెప్పారు. ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అని విజయసాయి రెడ్డి స్పష్టం…
నేడు కడపకు వైఎస్ జగన్: నేడు కడప జిల్లాకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. సొంత నియోజవర్గంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి కడపకు జగన్ చేరుకోనున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లిపోతారు. విద్యార్థులకు గుడ్…
బెయిల్‌పై విడుదలైన ఐదుగురు ముద్దాయిలు: మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులు నేడు బెయిల్‌పై విడుదలయ్యారు. కడప జైలు నుంచి నలుగురు, విశాఖ జైలు నుంచి ఒకరు విడుదల అయ్యారు. కడప జైలు నుంచి పండుగ నారాయణ రెడ్డి, ఓబి రెడ్డి, వడ్డే కొండ, బజన రంగనాయకులు విడుదల కాగా.. విశాఖ జైలు నుంచి రేఖమయ్య రిలీజ్ అయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చి వెంటనే.. నిందితులు తమ వాహనాల్లో…
పెనమలూరులో సీఎం పర్యటన: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు రాష్ట్రంలో పర్యటించనున్నారు. విజయవాడలోని పెనమలూరులో సీఎం చంద్రబాబు పర్యటించనుండగా.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు. సీఎం పెనమలూరులో ధాన్యం కొనుగోలు సెంటర్ పరిశీలించి.. రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం రెవెన్యూ సదస్సులో పాల్గొని అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. మళ్లీ అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు: ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి…
21 నుంచి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం: విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణ కార్యక్రమంకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 21 నుంచి 25 వరకు భవానీ దీక్షలు విరమణలు జరగనున్నాయి. దీక్షలు విరమణల ఏర్పాట్లపై నేడు ఇంద్రాకిలాద్రిపై సమీక్ష జరగగా.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ర, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో రామారావు పాల్గొన్నారు. ఈసారి 60 లక్షల మంది…
ఏపీలో ‘డైకిన్’ పెట్టుబడులు: జపాన్‌కు చెందిన ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ తయారీ దిగ్గజం ‘డైకిన్’ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో కంప్రెసర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. తైవాన్‌కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. డైకిన్ ఇండియా, రెచి ప్రెసిషన్ కలిసి ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను తయారుచేసి.. విదేశాలకు ఎగుమతి చేయనుంది. నేడు కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్: మాజీ సీఎం వైఎస్…
బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే దాడులు: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో హల్చల్ చేశారు. తిరువూరులోని వైన్స్ షాపుల ప్రక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేయించారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు 24 గంటల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయాలని సూచించారు. పట్టణంలో ఉన్న నాలుగు మద్యం దుకాణాల్ని పట్టణ శివారుకు తరలించాలని…
శ్రీవారి భక్తుల అలర్ట్: శ్రీవారి భక్తుల అలర్ట్. 2025 మార్చికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. ఇందులోనే లక్కీడిప్ కోటా కోసం డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో…
ఐదేళ్ల పాలన స్వార్థ రాజకీయాలకు నిదర్శనం: వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. స్వార్థ పరమైన వ్యక్తులు అధికారపీఠం ఎక్కితే.. ఏం నష్టం జరుగుతుందో గత ఐదేళ్లలో జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించకుండా నాశనం చేశారని, గత ప్రభుత్వ పాలన వల్ల భూముల ధరలు పడిపోయాయని మండిపడ్డారు. మరో సైబరాబాద్ నిర్మాణం ఏపీలో సీఎం చంద్రబాబు విజన్ వల్ల ఏర్పాటు అవుతుందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. సమాజంలో…
కెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం: తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉత్తర ద్వార దర్శనాలకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ.. పలు నిర్ణయాలు తీసుకున్నారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. టోకెన్లు లేని భక్తులను క్యూ లైన్లోనికి అనుమతించరు. అలానే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా.. వీఐపీ…