Koti Deepotsavam Day 12: కార్తీకమాసం పర్వదినాల్లో భాగంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 పన్నేండవ రోజు కార్యక్రమాలు అద్భుత ఆధ్యాత్మిక వైభవంతో మెరిశాయి. ఎన్టీఆర్ స్టేడియం భక్త కోలాహలం మధ్య శివ నామస్మరణతో మార్మోగింది. వేలాది భక్తులు ఒకే స్వరంతో “ఓం నమః శివాయ” జపిస్తూ వెలిగించిన దీపాలు ఆ ప్రాంగణాన్ని దివ్యజ్యోతి ప్రదేశంగా మార్చేశాయి. ప్రతి దీపం ఆత్మజ్యోతి సందేశాన్ని అందిస్తూ భక్తుల హృదయాలను పరవశింపజేసింది. 2012లో ఆరంభమైన…
భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఎన్టీఆర్ స్టేడియం అపూర్వమైన ఆధ్యాత్మిక కాంతులతో మిన్నంటింది. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం శివభక్తి జ్యోతులతో నిండిపోగా, భక్తి, ఆరాధనలతో నిండిన ఆ వాతావరణం ప్రతి భక్తుడి మనసును మైమరిపించింది. కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీలు ప్రతీ ఏటా నిర్వహించే ఈ మహోత్సవం, ఈసారి మరింత వైభవంగా, మహిమాన్వితంగా సాగుతోంది. ఈ…
Koti Deepotsavam 2025: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఆధ్యాత్మిక మహా సమ్మేళనం కొనసాగుతోంది.. భక్తి టీవీ నేతృత్వంలో జరుగుతోన్న కోటి దీపోత్సవంలో ఇప్పటికే విజయవంతంగా ఏడు రోజుల పాటు విశేష కార్యక్రమాలు నిర్వహించారు.. ప్రతీ రోజూ విశేష పూజలు.. కల్యాణాలు.. ప్రవచనాలు, వాహన సేవలతో భక్తులను కట్టిపడేస్తోంది కోటి దీపోత్సవం వేడుక.. Read Also: IND vs AUS: నేడు ఆస్ట్రేలియా- భారత్ మధ్య ఐదో టీ20.. సిరీస్ గెలిచేనా..? ఇక, ఈ కోటి దీపాల…
Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలకు మొదటి రెండు రోజులు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. 2012లో లక్ష దీపోత్సవంగా మొదలై, 2013లో కోటి దీపోత్సవంగా మారి భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతున్న ఈ దీపాల పండుగ,…
Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన వేడుకలకు తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎన్టీఆర్ స్టేడియం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది.
ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన బుక్ స్టాల్స్‌ను సందర్శించారు. అనంతతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్తిక మాసం శుభవేళ.. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో 'కోటి దీపోత్సవం' దిగ్విజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో 13వ రోజు మార్మోగిపోయింది. కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. కోటి దీపోత్సవం వేదికగా భక్తులను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. దీపాలతో ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించడం మన సంప్రదాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. రాష్ట్రపతికి కోటి దీపోత్సవం నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.