ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. సాలిడ్ ఫ్యుయల్ టెక్నాలజీతో రూపొందిచిన ఖండాంతర క్షిపణిని మరోసారి పరీక్షించి ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది.
ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తమ గగనతలాన్ని ఉల్లంఘించిన యూఎస్ గూఢచారి విమానాలను కూల్చివేస్తామని ఉత్తర కొరియా బెదిరించిన మరునాడే ఈ పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియా జపాన్ సముద్దం అని పిలవబడే తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు.
ఉత్తర కొరియా నియంత్రిస్తున్న ప్రాంతం గగనతలంలోకి అమెరికా మిలిటరీ గూఢచారి విమానం ఎనిమిది సార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. తమ దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఆ అమెరికా గూఢచారి విమానాన్ని తరిమికొట్టాయని అన్నారు.
ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో వేలాది మంది కొరియన్లు వీధుల్లోకి వచ్చారు. వారాంతంలో ప్రజలు అమెరికన్ వ్యతిరేక మార్చ్‌ను చేపట్టారు. యునైటెడ్ స్టేట్స్‌ను నాశనం చేసినందుకు "ప్రతీకార యుద్ధం" అని ప్రతిజ్ఞ చేస్తూ నిరసన నినాదాలు చేశారు.
North Korea: ఇటీవల ఉత్తర కొరియా ప్రయోగించిన గూఢాచార శాటిలైట్ విఫలం అయింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాడు. అయితే ఈ ప్రయోగం విఫలమై, రాకెట్ సముద్రంలో కుప్పకూలిపోయింది. తన మొదటి సైనిక గూఢచారి ఉపగ్రహాన్ని మే 31న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. సరిహద్దు దేశాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆ దేశం ప్రయోగాన్ని నిర్వహించింది.
North Korea: కిమ్ జాంగ్ ఉన్ నియంత పాలనలో ఉత్తర కొరియా ప్రజలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మూడేళ్లుగా ఆ దేశం పూర్తిగా ఐసోలేషన్ లో ఉంది. సరిహద్దులను మూసేసి, ఇతర దేశాలతో సంబంధాలను తెంచుకుంది. కోవిడ్ భయంతో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు దుర్భరంగా మారాయి. కోవిడ్ వల్ల చనిపోవడం కన్నా ఆకలిలో ప్రజలు చనిపోతున్నట్లు బీబీసీ వెల్లడించింది.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది, ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్యాంగ్యాంగ్ నిర్వహించిన నిషేధిత ఆయుధ పరీక్షల్లో తాజాది అని దక్షిణ కొరియా సైన్యం గురువారం తెలిపింది.
Kim Jong Un: నార్త్ కొరియా గురించి పెద్దగా ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అడపాదడపా వివరాలు తప్పితే పెద్దగా అక్కడి సమచారం బయటకు రాదు. ఇక అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికే నార్త్ కొరియా ప్రజలకు వేరే ప్రపంచం ఉందనే విషయం కూడా తెలియదు. తమకు తెలిసినంత వరకు కిమ్ కుటుంబమే దేవుళ్లు, కిమ్ చెప్పిందే నిజం. అంతలా ఆ దేశం నిర్బంధానికి గురవుతోంది.
North Korea : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కొత్త సీక్రెట్ ఆర్డర్ ఇచ్చారు. ఇందులో ఆత్మహత్యలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ జోంగ్ ఉన్ ఆత్మహత్యపై నిషేధం విధించారు.
కిమ్ నిద్ర రుగ్మతతో బాధపడుతున్నారని.. ఆల్కహాల్, సిగరెట్ల వ్యసనం తీవ్రమైందని తెలిపింది. కిమ్ చికిత్స కోసం విదేశాల నుంచి ఔషధాలు దిగుమతి చేసుకుంటోందని వెల్లడించింది. కిమ్ కు అనారోగ్య సమస్యలు మరింత తీవ్రం కావడంతో ఔషధాలను వాడుతున్నారంటోంది దక్షిణ కొరియా.