ఉత్తర కొరియా ఇవాళ (బుధవారం) తెల్లవారు జామున మళ్లీ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో నార్త్ కొరియా రెండు క్షిపణులను ప్రయోగించడం సంచలనం రేపుతుంది. ఉత్తర కొరియా ఇవాళ తెల్లవారు జామున ప్యోంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని సైట్ నుంచి ఈ రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది.
జపాన్ సముద్రంలోకి నార్త్ కొరియా ఈ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. దీనిని జపాన్ కోస్టుగార్డు కూడా ధృవీకరించినట్లు తెలిపింది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా దక్షిణ కొరియాలోని ఓడరేవుకు అణు బాలిస్టిక్ క్షిపణులను పేల్చగల జలాంతర్గామిని అమెరికా తీసుకొచ్చింది. ఈ జలాంతర్గామి వచ్చిన కొన్ని గంటల తర్వాత నార్త్ కొరియా తన తూర్పు తీరంలో ఉన్న సముద్రంలో రెండు క్షిపణులను లాంచ్ చేసింది. సియోల్, వాషింగ్టన్ ల మధ్య రక్షణ సహకారం పెరిగిన నేపథ్యంలో రెండు కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి.
Read Also: Coocaa Smart TV: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్.. 54990 వేల స్మార్ట్ టీవీ కేవలం 11 వేలకే!
ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులను విశ్లేషిస్తున్నట్లు దక్షిణ కొరియా సైన్యం పేర్కొనింది. మిత్రపక్షాలు నిన్న (మంగళవారం) సియోల్‌లో మొదటి న్యూక్లియర్ కన్సల్టేటివ్ గ్రూప్ ఈ మీటింగ్ ను నిర్వహించాయి. 1981వ సంవత్సరం తర్వాత మొదటి సారిగా బుసాన్‌లో ఒక అమెరికన్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ పోర్ట్ సందర్శన చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.