Russia: దీర్ఘకాలంగా జరుగుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మరన్ని ఆయుధాలను సమకూర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్ తో, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
North Korea: ఉత్తర కొరియా మరసారి తన అణు సమర్థతను చాటుకునేందుకు కీలక చర్యకు పాల్పడింది. తాజాగా ‘వ్యూహాత్మక అణుదాడి’(టాక్టికల్ న్యూక్లియర్ అటాక్) డ్రిల్ చేపట్టినట్లు ఉత్తరకొరియా పేర్కొంది. కిమ్ జోంగ్ ఉన్ గత కొంత కాలంగా అమెరికా, దక్షిణ కొరియాలకు తన అణుక్షిపణులతో సవాల్ విసురుతున్నాడు. అణుయుద్ధం జరిగినప్పుడు ఈ దేశాల నుంచి దాడుల్ని
కొరియా ద్వీపకల్పంలో వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్ వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి ప్రయోగాత్మక పరీక్షను పర్యవేక్షించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
అమెరికా సైనికుడు ఉత్తర కొరియా శరణుకోరినట్టు ఆ దేశం ప్రకటించింది. అమెరికా సైన్యంలో నెలకొన్న వివక్ష మూలంగా తన మనస్సు వికలంగా మారిందని.. అందుకే శరణు కోరుతున్నట్టు సైనికుడు చెప్పాడని.. ఉత్తర కొరియా ప్రకటించింది.
ఉత్తర కొరియా తన పక్కనున్న దేశంతో యుద్ధానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా గురువారం సెంట్రల్ మిటలరీ కమిషన్ సమావేశాన్ని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నిర్వహించారు.
రష్యా సైన్యంపై దాడి చేయడానికి ఉక్రెయిన్ ఉత్తర కొరియా రాకెట్లను ఉపయోగిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఓ మిత్ర దేశం ఆ ఆయుధాలను గతంలో రష్యా నుంచి స్వాధీనం చేసుకుని.. తమకు సరఫరా చేసినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ తెలిపినట్లు వార్తాసంస్థ వెల్లడించింది.
ఉత్తర కొరియా ఇవాళ (బుధవారం) తెల్లవారు జామున మళ్లీ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో నార్త్ కొరియా రెండు క్షిపణులను ప్రయోగించడం సంచలనం రేపుతుంది. ఉత్తర కొరియా ఇవాళ తెల్లవారు జామున ప్యోంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని సైట్ నుంచి ఈ రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది.