North Korea: కిమ్ జాంగ్ ఉన్ నియంత పాలనలో ఉత్తర కొరియా ప్రజలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మూడేళ్లుగా ఆ దేశం పూర్తిగా ఐసోలేషన్ లో ఉంది. సరిహద్దులను మూసేసి, ఇతర దేశాలతో సంబంధాలను తెంచుకుంది. కోవిడ్ భయంతో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు దుర్భరంగా మారాయి. కోవిడ్ వల్ల చనిపోవడం కన్నా ఆకలిలో ప్రజలు చనిపోతున్నట్లు బీబీసీ వెల్లడించింది.
2020లో కోవిడ్ నేపథ్యంలో నార్త్ కొరియా తన సరిహద్దుల్ని మూసేసింది. ఆ తరువాత నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే ఆహార సరఫరా నిలిచిపోయింది. దీంతో 1990లో ఏర్పడిన భయంకరమైన ఆహార సంక్షోభం తర్వాత ఇప్పుడు మరోసారి ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలను అక్కడి కొంతమంది ప్రజలు రహస్యంగా బీబీసీకి వెల్లడించారు. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ఆహార పదార్థాల సరఫరా ఆగిపోయింది. ఆహారం పండించేందుకు ఎరువులు, యంత్రాలు ఉత్తర కొరియాకు రావడం నిలిచిపోయింది. క్షిపణి ప్రయోగాలకు మిలియన్ల డబ్బును వెచ్చిస్తున్న నార్త్ కొరియా, తన 2.6 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని అందించలేకపోతోంది.
Read Also: Priya Prakash Varrier Hot Pics: ప్రియా ప్రకాష్ వారియర్ పరువాల విందు.. సైడ్ యాంగిల్స్‌తో చంపేస్తోంది!
రాజధాని ప్యాంగ్యాంగ్ లో ఒక మహిళ ఇంట్లో ఆకలితో ముగ్గురు మరణించినట్లు బీబీసీకి అక్కడి వ్యక్తుల చెప్పారు. ‘‘మేము వారికి నీరు అందించాలని తలుపు తట్టాము.. కానీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు, అధికారులు లోపలికి వెళ్లి చూస్తే చనిపోయినట్లు తెలిసింది’’ అని చెప్పారు. చైనా సరిహద్దు ప్రాంతంలో నివసించే మరో నిర్మాణ కార్మికుడు మాట్లాడుతూ.. ఆహార సరఫరా చాలా తక్కువగా ఉందని, తమ గ్రామంలో ఆకలితో ఇప్పటికే ఐదుగురు మరణించారని వెల్లడించాడు. నేను కోవిడ్ తో మరణిస్తానని భయపడ్డాను, కానీ ఆకలితో చనిపోతానేమో అనే ఆందోళన మొదలైనట్లు బీబీసీకి తెలిపాడు. 1990లో నార్త్ కొరియాలో ఏర్పడిన కరువు 30 లక్షల మందిని చంపింది. సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఆకలితో చనిపోవడం ఆందోళనకరంగా ఉందని ఉత్తర కొరియా ఆర్థికవేత్త పీటర్ వార్డ్ అన్నారు.