Kim Yo Jong: ఉత్తర కొరియా గగనతలంలోకి అమెరికా గూఢచారి విమానం.. కిమ్ సోదరి వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Yo Jong: ఉత్తర కొరియా నియంత్రిస్తున్న ప్రాంతం గగనతలంలోకి అమెరికా మిలిటరీ గూఢచారి విమానం ఎనిమిది సార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. తమ దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఆ అమెరికా గూఢచారి విమానాన్ని తరిమికొట్టాయని అన్నారు. ఆ ప్రాంతంలో అమెరికా నిఘా కార్యకలాపాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు.ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియాలో ప్రచురించిన కిమ్ సోదరి యో జోంగ్ వ్యాఖ్యలపై అమెరికా, దక్షిణ కొరియా మిలిటరీలు ఇంకా స్పందించలేదు.
Also Read: World Population Day 2023: నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.. ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
Also Read
మరోవైపు ఉత్తర కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానిస్తూ.. గతంలో అమెరికా తమ గగనతలంలోకి గూఢచారి విమానాలను ఎగురవేస్తోందని ఆరోపించింది. వాటిని కూడా కూల్చివేస్తామని హెచ్చరించింది. ఉత్తర కొరియా భూభాగంలోకి అమెరికా గూఢచారి విమానాలను ఎగురవేయడాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఖండించారు. దక్షిణ కొరియా సైన్యంతో కలిసి అమెరికా ప్రామాణిక నిఘా కార్యకలాపాలు చేస్తోందని వారు తెలిపారు. ఆ మాటలపై స్పందించిన కిమ్ యో జోంగ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ యూఎస్ మిలిటరీకి ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అమెరికా తన నిఘా కార్యకలాపాలను ముమ్మరం చేస్తోందని, ఇది ఉత్తర కొరియా సార్వభౌమాధికారం, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు.
Also Read: India: 2075 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ఉత్తర కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన తమ ప్రాదేశిక గగనతలంలోకి చొరబడడాన్ని సూచించగా, ఉత్తర కొరియాకు చెందిన ప్రత్యేక ఆర్థిక మండలంలోకి అమెరికా గూఢచారని విమానాన్ని పంపిందని కిమ్ యో జోంగ్ ఆరోపించారు.ఈ ప్రాంతంలోకి అమెరికా గూఢచారి విమానం ప్రవేశించిందని, అయితే ఉత్తర కొరియా యుద్ధ విమానాలు దానిని తరిమికొట్టాయని ఆమె చెప్పారు.ఆపై ఉత్తర కొరియా సైన్యం నుంచి బలమైన హెచ్చరిక వచ్చింది.ఉత్తర కొరియా తమ ప్రత్యేక ఆర్థిక జోన్‌పై నిఘా విమానాలను ఎగురవేయడాన్ని కొనసాగిస్తే ఉత్తర కొరియా నిర్ణయాత్మక చర్య తీసుకుంటుందని కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!