Putin: చైనా, రష్యా దేశాల మధ్య బంధం మరింతగా బలపడుతోంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికాతో సహా వెస్ట్రన్ దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరును తప్పుపడుతున్నాయి. మరోవైపు రష్యాపై ఆర్థిక ఆంక్షలను విధించాయి. ఇదే విధంగా చైనాతో అమెరికా సంబంధాలు పూర్తిగా దిగజరాయి. మరోవైపు యూరోపియన్ దేశాలకు కూడా చైనా అంటే నమ్మకం సన్నగిల్లింది. కోవిడ్ తర్వాత చైనాతో అరకొర సంబంధాలను కంటిన్యూ చేస్తున్నాయి ఆయా దేశాలు.
Read Also: Rudramkota: శ్మశానంలో లవ్ స్టోరీ ‘రుద్రం కోట’.. మిస్ కావద్దంటున్న శ్రీకాంత్
ఇదిలా ఉంటే అమెరికాకు, వెస్ట్రన్ దేశాలకు వ్యతిరేకంగా రష్యా, చైనా దగ్గరవుతున్నాయి. చైనా, రష్యా అధినేత పుతిన్ ని తమ దేశంలో పర్యటించాల్సిందిగా కోరింది. ఇందుకు తాను అంగీకరించినట్లు పుతిన్ బుధవారం వెల్లడించారు. అక్టోబర్ నెలలో పుతిన్ చైనాలో పర్యటించనున్నారు. “అక్టోబర్‌లో చైనాను సందర్శించాలని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఛైర్మన్ చేసిన ఆహ్వానాన్ని అంగీకరించడం నాకు సంతోషంగా ఉంది” అని అధ్యక్షుడు పుతిన్ బీజింగ్ విదేశాంగ మంత్రి వాంగ్ యితో అన్నారు.
అమెరికాకు వ్యతిరేకంగా ఉండే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల రష్యాలో పర్యటించారు. ఇది యూఎస్ఏకు అస్సలు రుచించలేదు. ఉత్తరకొరియా, రష్యాల మధ్య ఆయుధ ఒప్పందం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న రష్యా, నార్త్ కొరియా నుంచి మందుగుండు సామాగ్రితో పాటు మరికొన్ని యుద్ధ సామగ్రిని కోరింది, ఇదే ప్రతిగా నార్త్ కొరియా, రష్యా నుంచి శాటిలైట్ టెక్నాలజీ, అణు సామర్థ్యం ఉన్న జలంతర్గామి టెక్నాలజీని కోరినట్లు సమాచారం.