టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు నామినేషన్ దాఖలుకు ఆఖరి రోజు కావడంతో మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు ముహూర్తం చూసుకుని కవిత తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి సమర్పించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్లతో కలిసి కవిత నామినేషన్ దాఖలు చేశారు. Read…
కడప జిల్లా మైదుకూరులో వింత ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడు లేకపోతే తాను బతకలేనంటూ ఓ యువకుడు హల్చల్ చేశాడు. దయచేసి తన ప్రియుడితో తనను కలపాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కంది సాయికుమార్ దుబాయ్లో పనిచేస్తున్నాడు. అతడికి టిక్ టాక్ ద్వారా మస్కట్లో పనిచేస్తున్న కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ సెల్ఫోన్లలో ప్రతిరోజూ గంటల తరబడి మాట్లాడుకునేవారు.…
నిజామాబాద్ నగరంలో 34వ డివిజన్ కార్పొరేటర్ భర్త మల్లేష్ గుప్తా వీరంగం సృష్టిస్తున్నారు. వాటర్ వర్క్ చేస్తున్న అడ్డా కూలి పై విచక్షణ రహితంగా దాడి చేసారు. కాలితో తన్ని పిడి గుద్దు లు కురిపించారు కార్పొరేటర్ భర్త, నుడా డైరెక్టర్ మల్లేష్ గుప్తా. రాములు అనే అడ్డా కూలిని చితక బాధిన వీడియో వైరల్ అవుతుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఘటన పై ఫిర్యాదు చేసింది బాధితురాలు. తన అనుమతి లేకుండా…
నరకానికి కేరాఫ్ అడ్రస్గా మారింది బోధన్ రోడ్డు. ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలవుతున్నవారు ఎందరో. గత రెండున్నరేళ్ళుగా బోధన, బాన్స్ వాడ రోడ్డుని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో మరింతగా గుంతలు పడ్డాయి. గర్భిణీలు ఈ రోడ్డుపై వెళ్ళి ఆస్పత్రికి చేరాలంటే భయపడుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నేతలు ఆ తర్వాత వాటి అమలును మరిచిపోతున్నారు. దీంతో రోడ్డు పై ప్రయాణించాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజూ వందలాదిమంది…
ఉమ్మడి నిజామాబాద్లో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతులు పడిగాపులు పడుతున్నారు. కోత పూర్తి చేసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన తర్వాత వారికి అసలు కష్టాలు ఎదురవుతున్నాయి. కేంద్రాల్లో నిబంధనలకు అనుగు ణంగా 17శాతంలోపు ఉంటే తప్ప కాంటా వేయడం లేదు. ఒక వేళ తేమ శాతం వచ్చినా తమ తమ వంతు వచ్చే వరకు ఎదురు చూడక తప్పడం లేదు. ఈ రెండు దాటుకుని ముందుకు వస్తే అప్పటికే కాంటాబస్తాలతో…
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతుల ప్రాణాలు పోతున్న పట్టించుకోవడం లేదు.ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలి అయింది. తాజాగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఓ రైతు మృతికి కారణమైంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు బీరయ్య(57) గుండె పోటుతో మృతి చెందాడు. తన ధాన్యం కుప్ప వద్ద కాపలా కోసం వచ్చిన రైతు బీరయ్య అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి గుండెపోటు…
తెలంగాణలో చిరుతలు అలజడి కలిగిస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాలో చిరుతలు నడిరోడ్లపైకి, వ్యవసాయ క్షేత్రాల్లోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలం నగాధర్ శివారులో చిరుత పులి తిరుగుతున్నట్టు రైతులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చిరుత పులి కదలికలను రైతులు విడుదల చేయడంలో సమీపంలోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతు రామయ్య కు చెందిన లేగదూడను చంపేసింది ఆ చిరుత పులి. కల్హేరు సిర్గాపూర్…
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తారు నాయకులు. పదవిలో ఉండగానే వారసులను జనాలకు పరిచయం చేయడం.. వీలైతే ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకుంటారు. ఆ ఎమ్మెల్యే కూడా అదే చేశారు. కాకపోతే తండ్రి ఎమ్మెల్యేగా ఉంటే.. తనయుడు షాడోగా పెత్తనం చేయడమే ఆ నియోజకవర్గంలో చర్చగా మారింది. ఇంతకీ ఎవరా షాడో? ఏమా కథ? బాజిరెడ్డి కుమారుడి తీరుపై పార్టీలో చర్చ..! బాజిరెడ్డి గోవర్దన్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే. ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ అయ్యారు గోవర్దన్.…
బంధాలు.. అనుబంధాలకు విలువ లేని ప్రపంచం.. కన్న తల్లిదండ్రుల కంటే కరెన్సీ నోట్లకే ఎక్కువ విలువ ఇవ్వడం బాధాకరమైన విషయం అయితే.. డబ్బుకోసం కనిపెంచిన వారిని అత్యంత దారుణంగా కడతేర్చడం విచారించాల్సిన విషయం. తాజాగా ఒక కసాయి కొడుకు, తల్లి ఐదెకరాల పొలం నుంచి వచ్చే రైతు బంధు డబ్బుల కోసం కిరాతకంగా చంపిన ఘటన నిజామాబాద్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ముక్కెర సాయమ్మ(50) కు ఒక…
ఎన్ని చదువులు చదువుకొని ఏమి ప్రయోజనం సంస్కారం లేకపోతే.. ఇంకా సమాజంలో ఆడపిల్లలపై వివక్ష పోలేదని కొన్ని సంఘటనలు చూస్తుంటే తెలుస్తోంది. ఇంకా ఆడపిల్ల పుట్టిందని భార్యను వేధిస్తున్న భర్తలకు కొదువే లేదు. తాజాగా ఒక ప్రబుద్దుడు కూడా వరుసగా ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని భార్యను పుట్టింటికి పంపి, వదిలించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భార్య, భర్త ఇంటిముందు ధర్నాకు దిగిన ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని…