నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ చాంబర్‌లో ప్రొటెం చైర్మన్ జాఫ్రీ కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనా కవితతో పాటు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎన్నికైనా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇంకా మరో పదిమంది ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.
Read Also: ఇండియా టెన్నిస్ స్టార్ సానియామీర్జా రిటైర్మెంట్
కవితతో పాటు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌లో కవితను ఎన్నుకోవడంతో స్థానిక ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు భరోసా కలిగించినట్లయిందని మహేష్ బిగాల పేర్కొన్నారు. ఆమె మున్ముందు మరిన్ని పదవులు చేపట్టాలని కోరుకుంటున్నట్టు మహేష్ బిగాల తెలిపారు.