దాడులు చేసే సంస్కృతికి బీజేపీ వ్యతిరేకం: బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాడులు చేసే సంస్కృతికి బీజేపీ వ్యతిరేకమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరన్నారు. రుణ మాఫీ ,డబల్ బెడ్ రూమ్ ,పెన్షన్ లాంటి పనులు సరిగా ఇవ్వని టీఆర్‌ఎస్ నాయకులపై ఇలానే దాడులు చేయమంటారా అంటూ ఫైర్ అయ్యారు. సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడానికైనా కాషాయ కార్యకర్తలు వెనుకడారన్నారు. నంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్ అన్నారు. దాడులు చేసేందుకా తెలంగాణ తెచ్చుకుంది అంటూ టీఆర్‌ఎస్‌ను నిలదీశారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తూ భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం నేను చావడానికైనా సిద్ధం ..కేసీఆర్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఒక్కసారి మేము మీలాగే దాడులు చేయడం స్టార్ట్ చేస్తే …బిస్తరి కట్టుకుని వెళ్తారన్నారు.
Read Also: తెలంగాణలో మరో మంత్రికి కరోనా.. రెండోసారి పాజిటివ్..
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
పార్లమెంట్‌లో తెలంగాణ ఓటింగ్ బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వకుంటే ఇవాళ కేసీఆర్ సీఎం అయ్యేవాడా అంటూ ప్రశ్నించారు. ఏడాది మాత్రమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంటుంది ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు. ఐపీఎస్ అధికారులు ఈ ప్రభుత్వ ధోరణితో విసిగిపోయి సరిగా డ్యూటీలు చేయలేకపోతున్నారన్నారు. ప్రభుత్వానికి భయపడి, లోంగిపోయి పోలీసులు చట్ట వ్యతిరేకంగా డ్యూటీ చేస్తుంటే ప్రజలు అసహ్యంచుకుంటున్నారన్నారు. నిజామాబాద్ సీపీ నేతృత్వంలో జరిగిన హత్యయత్నం ఇది అని సంజయ్ ఆరోపించారు. పార్లమెంట్ సభ్యుడి పై దాడి చేస్తే ఇప్పటికి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఖలిస్థాన్ సంస్థ లాంటి వాటితో సంబధాలున్నాయా..? అంటూ విరుచుకుపడ్డారు. ప్రధానిని అడ్డుకుంది రైతులు అన్నారు. మేమే అడ్డుకున్నామని ఖలిస్తాన్ ప్రకటించిందని తెలిపారు. నిజామాబాద్ లోను రైతులు దాడి చేశారని టీఆర్‌ఎస్ చెబుతుంది. కానీ రైతులు ఎవ్వరూ కర్రలు, కత్తులతో దాడి చేయరని సంజయ్ అన్నారు.
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్‌ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!