కరోనా పోవాలి.. మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలి.. అన్ని పండులను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాక్షించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన దసరా వేడుకకల్లో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేశారు.. అయితే, కరోనా ప్రభావం వల్ల రావణ దహనం నిర్వహించడం లేదని తెలిపిన ఆమె.. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని దుర్గాదేవిని వేడుకుందామని..…
మహిళలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించేలా చేస్తున్నారు కామాంధులు.. దేశవ్యాప్తంగా ఏదోఒక చోట వరుసగా చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా నిజామాబాద్‌లో దళిత యువతిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు నలుగురు యువకులు.. నిందితుల్లో ఓ యువకుడితో సదరు యువతికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తుండగా.. ఇక, బర్త్ డే పార్టీ ఉందంటూ.. యువతిని ఆహ్వానించాడు ఆ కామాంధుడు.. దీంతో.. ఆర్మూర్ నుంచి…
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా నిజమాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు 1లక్ష 69వేళా క్యూస్సేక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 32 గేట్ల ద్వారా 1లక్ష 49 వేళా క్యూస్సేక్కులకు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి కి కాకతీయ ద్వారా 7500 క్యూస్సేక్కులు… సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు.. అలాగే లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూస్సేక్కులు… వరద కాలువ ద్వారా 9700 క్యూస్సేక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ఇక ప్రాజెక్టు…
దేశంలో బలమైన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకొంది. మైనర్ ఆడపిల్లలకు చాక్లెట్ల పేరుతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. చాక్లెట్లు ఇచ్చి ముద్దులు ఇవ్వాలంటూ మైనర్ బాలికలపై రవీందర్ కామంతో పైశాచిక ఆనందం పొందుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. నగరంలోని సాయినగర్ లో గత కొన్ని రోజులుగా ఈ సంఘటన జరుగుతుండగా.. చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. నిందితుడికి దేహశుద్ధి చేసిన…
నామినేటెడ్ పదవులు ఆ జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెడుతున్నాయా? పోస్ట్‌లను అనుచరులకు కట్టబెట్టేందుకు చేస్తున్న లాబీయింగే గొడవ రాజేస్తోందా? ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య కాకరేపుతున్న రెండు పదవులు. వానిపైనే పార్టీవర్గాల్లో ఆసక్తికర చర్చ. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం. రెండు పదవుల కోసం ముగ్గురు ఎమ్మెల్యేల కుస్తీ! తెలంగాణలో నామినేటెడ్ పదవుల పంపకం ఉంటుందన్న చర్చ జరుగుతున్న తరుణంలో.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు చర్చగా మారాయి. తమనే నమ్ముకుని ఉన్న…
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, తన సోదరుడు డి. సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. బాన్సువాడ, బోధన్ నియోజకవరర్గాల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరారు.. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన అరవింద్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సెప్టిక్ ట్యాంక్ లకు నేను దూరంగా ఉంటానని వ్యాఖ్యానించారు.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు దిక్కులేరు. .డబ్బులిచ్చి కార్యక్రమాలకు రప్పిస్తున్నారు అని ఆరోపించిన ఆయన.. రేవంత్‌రెడ్డి తన కోపాన్ని…
కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నా.. ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా నందిపేటలో కరోన కలకలం సృష్టించింది.. సూర్యాపేట నుండి వచ్చిన వలస కూలీలకు 16 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది… దీంతో. వారితో కలిసి పనిచేసినవారిలో టెన్షన్ మొదలైంది.. దీంతో.. వారితో కలిసి పనిచేసిన 200 మంది వలస కూలీలకు రేపు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు వైద్యశాఖ అధికారులు.. మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన వారిని…
అక్రమార్కుల భరతం పడతామని కొరడా బయటకు తీశారు. దూకుడుగా వెళ్లారు కూడా. ఇంతలో ఏమైందో ఏమో ఉలుకు లేదు పలుకు లేదు. ఎక్కడివారు అక్కడే గప్‌చుప్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోన్న ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. నాడు గంభీరమైన ప్రకటనలు.. నేడు పత్తా లేరు! తప్పు చేస్తే తాట తీస్తాం. ఎంతటి వారైనా వదిలేదు లేదు. కటకటాల వెనక్కి నెట్టడం ఖాయం. కరోనా సమయంలో నిజమాబాద్ జిల్లా ఉన్నతాధికారులు గంభీరంగా పలికిన…
కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న పోలీసులకు వివిధ వర్గాల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జిల్లాలో మాత్రం కొందరు చేస్తున్న పనులు డిపార్ట్మెంట్కు మింగుడు పడటం లేదట. మరక తెస్తున్న బ్లాక్షీప్లను పట్టుకునే పనిలో పడ్డారట ఉన్నతాధికారులు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. సిబ్బంది తీరుతో అధికారులకు తలనొప్పి! ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొందరు పోలీసుల తీరు.. అక్కడి అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందట. ఒకదాని వెనక ఏదో ఒక విమర్శలు రావడం..…
నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ అడవి ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ప్రేమికులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అంతేకాదు.. మోస్రామ్ మండలం తిమ్మాపూర్ కి చెందిన మోహన్,లక్ష్మి గా వారిని గుర్తించారు పోలీసులు. వారం రోజుల క్రితమే వారు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. అటు వారం…