ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పర్యటనలో భాగంగా రామగుండంలో ఎన్టీపీసీ రూ.6 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు.
నేడు తెలంగాణ పర్యటనకు వస్తున్న.. ప్రధాని నరేంద్ర మోడీ 8వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. ఇక, ప్రధాని పర్యటన వేళ ట్విట్టర్ వేదికగా ప్రధానిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ( ఎక్స్ ) పోస్ట్.. 1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు?
నేడు తెలంగాణ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. నిజామాబాద్ లో బీజేపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా నామకరణం చేశారు. 8021 కోట్ల రూపాయల ప్రాజెక్టులను శంకుస్థాపన చేసి వాటిని ఆయన జాతికి అంకితం చేయనున్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ( అక్టోబర్ 3వ తారీఖు) నిజామాబాద్ కు వస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో నిర్మించిన ఎన్టీపీసీని 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును ఇందూర్ వేదికగా ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు అని తెలిపారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 3న నిజామాబాద్ జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు అని తెలిపారు. 8 వందల మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ కు ఆయన వర్చువల్ గా ప్రారంభోత్సవం చేయనున్నారు. లక్ష మందితో సభ నిర్వహిస్తున్నాం.. ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర వహించబోతుంది.. ఖమ్మంలో కూడా పార్టీ బలపడింది.. మోడీ పర్యటన రాష్ట్ర రాజకీయాలకు దిశా నిర్దేశంగా ఉండబోతుంది అని ఆయన అన్నారు.
Lecturer made a student pregnant in Nizamabad: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ గాడీ తప్పాడు. క్లాసులు చెప్పాల్సిన లెక్చరర్ ప్రేమ పాఠాలు చెప్పాడు. యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. తరువాత అతడి గురించి విస్తుపోయే నిజాలు తెలియడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. ఈ ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఓ విద్యార్థిని కార్పొరేట్ కళాశాలలో కోచింగ్ కోసం జాయిన్ అయ్యింది. ఆ యువతిని కాలేజీలో చేర్పించేటప్పుడు తమ బిడ్డ…
PM MODI:తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి ఊపందుకుంది. ఇప్పటికే.. కలెక్టరేట్ల ప్రారంభోత్సవం పేరుతో సీఎం కేసీఆర్ ఆయా జిల్లాలకు వెళ్లి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు.
తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఆయన చెప్పు కొచ్చారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందించారు.
నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరికి ఓటు వేసినా మాకే పడుతుంది.. బీజేపీనే గెలుస్తుంది అని సంచలన కామెంట్స్ చేశారు. ఇక, ఆవాస్ యోజన ద్వారా దేశ వ్యాప్తంగా 5 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చాము.