నిజామాబాద్ జిల్లాలో ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా.. నగరంలో ఐటీ టవర్ ను ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కోరుకునేది అభివృద్ధి సంక్షేమమని తెలిపారు. ఎన్నికలు వస్తే సంక్రాంతి గంగిరెద్దుల వచ్చినట్లు వస్తారు.. జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ అన్నారు.
Minister KTR: నిజామాబాద్ ఐటీ టవర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్ను పరిశీలించారు.
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నిజామాబాద్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐటీ టవర్ తో పాటు న్యాక్, మున్సిపల్ భవనాలను ఆయన ప్రారభించనున్నారు. మినీ ట్యాక్ బండ్, వైకుంఠ దామాలను ప్రారంభిస్తారు. పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్.. తాజాగా నిజామాబాద్ ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధం చేసింది.
Nizamabad: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విషసర్పాలు, తేళ్లు అడవిని వదిలి జనావాసాల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. చీకటి, వెచ్చని ప్రదేశాలను వెతుక్కుంటూ పాములు జనావాసాల్లోకి ప్రవేశిస్తాయి.
MLC Kavitha: ఎంపీ అర్వింద్ పిచ్చి ప్రేలాపణలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల సమయం ఇస్తా ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే ముక్కు నేలకు రాయాని ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు.
MLC Kavitha: కేటీఆర్ చేతుల మీదుగా ఈనెల 29న ఐటి హబ్ ప్రారంభం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.
Women Thieves: షిర్డీ రైలులో మహిళా దొంగలు బీభత్సం సృష్టించారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలోని క్రాసింగ్ వద్ద రైలు ఆగింది. అక్కడే ట్రైన్ దోచుకునేందుకు వేచి వున్న మహిళలు రైలు ఆగడంతో ఒక్కసారిగా 9 మంది అందులో ఎక్కారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అబ్బాపూర్ (బి) తండాలో అర్థరాత్రి 13 ఏళ్ల మైనర్ బాలికను సాయిబ్రావు అనే 45 ఏళ్ల వ్యక్తికి బాల్య వివాహం చేశారు. అయితే సాయిబ్రావుకు అప్పటికే వివాహమై భార్య మృతి చెందింది. ఆయనకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.