Women Thieves: షిర్డీ రైలులో మహిళా దొంగలు బీభత్సం సృష్టించారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలోని క్రాసింగ్ వద్ద రైలు ఆగింది. అక్కడే ట్రైన్ దోచుకునేందుకు వేచి వున్న మహిళలు రైలు ఆగడంతో ఒక్కసారిగా 9 మంది అందులో ఎక్కారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అబ్బాపూర్ (బి) తండాలో అర్థరాత్రి 13 ఏళ్ల మైనర్ బాలికను సాయిబ్‌రావు అనే 45 ఏళ్ల వ్యక్తికి బాల్య వివాహం చేశారు. అయితే సాయిబ్‌రావుకు అప్పటికే వివాహమై భార్య మృతి చెందింది. ఆయనకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ హత్యయత్నం కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు అల్తాప్ తండ్రి అబ్దుల్ బాకీ ఖురాన్ తలపై పెట్టుకుని చేసిన వ్యాఖ్యలపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఓ వీడియోను విడుదల చేశాడు. నా హత్యకు కుట్ర చేశారు.. సొంత పార్టీ కౌన్సిలర్లు, ఎంఐఎం నేతలు ముఠాగా ఏర్పడారు అని ఆయన అన్నారు.
తాజాగా నిజామాబాద్ జిల్లాలో లోన్ యాప్ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. నవిపేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి లోన్ యాప్ నుంచి ఏజెంట్లు నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని సదరు వ్యక్తి ఆందోళనకు గురయ్యాడు.
MLC Kavitha: ముఖ్యమంత్రిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌లోని న్యూ అంబేద్కర్ భవన్‌లో జరిగిన నీటి పారుదల దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
Telangana University: తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ, విజిలెన్స్ బృందాల దాడుల టెన్షన్ మొదలైంది. నిన్న 8 గంటల పాటు యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టిన అధికారుల బృందం కీలక దస్త్రాలు, హార్డ్ డిస్క్ ల స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ యూనివర్సిటీలో ఈసీ వర్సెస్ వీసీ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, ఏసీబీ దాడులు నిర్వహించారు. యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై ఆరోపణలు వస్తున్న.. నేపథ్యంలో రైడ్స్ చేశారు అధికారులు. అటు అకౌంట్ సెక్షన్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, బిల్డింగ్ సెక్షన్, ఏవో కార్యాలయంలో సోదాలు చేసి.. పలు ఫైళ్లను అధికారులు పరిశీలించారు.
DRDO Director : డీఆర్డీవో ఎంఎస్ఎస్ కొత్త డైరక్టర్ జనరల్‌గా ప్రముఖ శాస్ర్తవేత్త అయిన ఉమ్మలనేని రాజబాబు నియమితులయ్యారు. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)లో మిసైల్స్ అండ్ స్ట్రటజిక్ సిస్టమ్స్(ఎంఎస్ఎస్) డైరక్టర్ జనరల్‌గా రాజబాబును నియమించారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీని గెలిపిస్తే పసుపు బోర్డు రాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nizamabad : కార్లతో భారీ ఛేజింగ్ సీన్లు సినిమాల్లో చూసి మనం తెగ ఎంజాయ్ చేస్తుంటాం. నిజంగా అలా జరుగుతుందా అని ఓ సారి ఆశ్చర్యపోతుంటాం. నిజంగా రియల్ లైఫ్ లో అలాంటిదే జరిగితే చూస్తే థ్రిల్ అనిపిస్తుంది కదూ.