MP Arvind: రేపు నిజామాబాద్ కు ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ( అక్టోబర్ 3వ తారీఖు) నిజామాబాద్ కు వస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో నిర్మించిన ఎన్టీపీసీని 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును ఇందూర్ వేదికగా ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు అని తెలిపారు. అనంతరం గవర్నమెంటు ప్రభుత్వ గిరిరాజ్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు అని ఆయన చెప్పారు. వర్షం కురిసినా ఇబ్బందిలేకుండా రెండు లక్షల మంది కూర్చునేలా సభను ఏర్పాటు చేసినట్లు ఎంపీ అర్వింద్ వెల్లడించారు.
Read Also: Gandhi Temple: నల్గొండలో గాంధీ గుడి.. కోరిన కోర్కేలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
అయితే, ఈ సభకు మొదట ఇందూరు జనగర్జన పేరు పెట్టారు.. కానీ, పాలమూరు వేదికగా రాష్ట్రానికి ప్రధాని మోడీ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో సభను ధన్యవాద్ సభగా మార్చినట్లు బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో వచ్చి పసుపు బోర్డు ఇస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలుపాలని ఎంపీ అర్వింద్ కోరారు. ఇక, నేడు (సోమవారం) గ్రౌండ్ మొత్తం ఎస్పీజీ అధికారుల కంట్రోల్లోకి వెళ్లనుంది. వారి ఆధీనంలోకి వెళ్లాక వ్యక్తుల రాకపోకలపై నిఘా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త కలెక్టరేట్లోని హెలిపాడ్లో హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యాక ప్రత్యేక మార్గంలో ప్రధాని మోడీ బీజేపీ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి ఐదు నిమిషాల్లో చేరుకుంటారు. మొత్తం 2 వేలకు పైగా పోలీసులు ప్రధాని బందోబస్తులో పాల్గొన్నారు.
Read Also: Bigg Boss 7Telugu: నాలుగు వారాలకే రతిక ఔట్.. ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?
అయితే, ప్రధాని మోడీకి చేరువలో ఉండే వ్యక్తులకు ప్రత్యేక పాస్లు ఎస్పీజీ సిఫారసు మేరకు జిల్లా పోలీసులు జారీ చేస్తున్నారు. నిజామాబాద్ వచ్చాక ప్రధాని మోడీ 2 గంటల పాటు ఉండనున్నారు. ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించారు. బీజేపీ సభకు మూడు కిలోమీటర్ల దూరం వరకు ఆంక్షలు, ప్రతి ఒక్కరి కదలికలపై ఎస్పీజీ అధికారులు నిఘా పెట్టారు. డ్రోన్ కెమెరాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ ను నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించారు. 2 వేల మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చూస్తున్నారు. ఇక,
సభా స్ధలీ, హెలిప్యాడ్ స్ధలాన్ని తమ ఆధీనంలో కేంద్ర బలగాలు, ఎస్పీజీ అధికారులు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!