KTR Tweet: ప్రధాని గారు మా మూడు ప్రధాన హామీల సంగతేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు తెలంగాణ పర్యటనకు వస్తున్న.. ప్రధాని నరేంద్ర మోడీ 8వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. ఇక, ప్రధాని పర్యటన వేళ ట్విట్టర్ వేదికగా ప్రధానిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ( ఎక్స్ ) పోస్ట్.. 1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు?, 2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు?, 3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు?, మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నారు.. మరి.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది? అని కేటీఆర్ ప్రశ్నించారు.
Read Also: AP BJP: నేడు ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ.. జనసేనతో పొత్తుపై కీలక చర్చ
Also Read
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర..? అని మంత్రి కేటీఆర్ అడిగారు. మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు..?, గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా?.. కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారు అని ఆయన విమర్శించారు. లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్ ను ఆగం చేశారు.. మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారు.. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారు.. మీ పదేళ్ల పాలనలో.. 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారు అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు.
Read Also: NTR: ఆ సూపర్ స్టార్స్ ‘అవెంజర్స్’ అయితే ఎన్టీఆర్ ‘థానోస్’ లాంటి విలన్…
2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్నారు.. దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు అన్నారు.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారు.. పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం అన్నారు.. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మీ పసుపు బోర్డు ప్రకటన కూడా.. మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉంది.. ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు.. మరి అది అమలు అయ్యేది ఎప్పుడో.. ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో.. అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటి..! అని అడిగారు.
Read Also: Bathukamma Sarees: రేపటి నుంచి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ..
మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా..! అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ..! అని ఆయన విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారు.. పెట్రోల్ ధరలు నియంత్రిస్తామన్నారు.. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప.. దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటనుు నెరవేర్చరా..? కేటీఆర్ అంటూ ట్వీట్ చేశారు.
ప్రధాని @narendramodi గారు…
మా మూడు ప్రధాన హామీల సంగతేంటి…???1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ?
2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ?
3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ?
మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు…..మరి.. ఆ…
— KTR (@KTRBRS) October 3, 2023
తాజావార్తలు
-
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
-
YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
-
Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!