నేడు తెలంగాణ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. నిజామాబాద్ లో బీజేపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా నామకరణం చేశారు. 8021 కోట్ల రూపాయల ప్రాజెక్టులను శంకుస్థాపన చేసి వాటిని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలోని NTPCలో 6వేల కోట్ల రూపాయలతో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను తెలంగాణ ప్రజలకు మోడీ అంకితం ఇవ్వనున్నారు. ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 85 శాతం (680 మెగావాట్లు) తెలంగాణలోనే వినియోగించేలా నిర్మాణం చేశారు.
Read Also: Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
ఇక, వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి కానున్న రెండో దశ విద్యుత్ ప్రాజెక్టు.. అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో ఈ ప్లాంటు నిర్మాణం.. 305 కోట్ల రూపాయలతో 348 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తయిన.. ధర్మాబాద్ (మహారాష్ట్ర) -మనోహరాబాద్, మహబూబ్‌నగర్ – కర్నూల్ రైల్వే లైనును.. ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. 1200 కోట్ల రూపాయలతో 76 కిలోమీటర్ల మేర నిర్మించిన మనోహరాబాద్-సిద్దిపేట కొత్త రైల్వే లైనును కూడా ప్రధాన మంత్రి చేతుల మీదగా ప్రారంభం కానుంది.
Read Also: Bigg Boss Telugu 7: ఈ వారం నామినేషన్ లో ఎవరున్నారో తెలుసా?
అయితే, కొమురవెల్లి మల్లన్న.. దర్శనార్థం వచ్చే భక్తు సౌకార్యార్థం.. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లో భాగంగా తెలంగాణలో 1,369 కోట్ల రూపాయలతో.. 496 బస్తీ దవాఖానాలు, 33 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీస్, 31 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్ లను నిర్మించాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. మొదటి విడుతగా 20 జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో ప్రధానమంత్రి ఆయుష్మాన్ 516.5 కోట్ల రూపాయలతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ లకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ వస్తున్నారు.
Read Also: Tabu: నాగ్ హీరోయిన్ అంటే.. ఆ మాత్రం హాట్ ఉండాలిగా
దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు (సీసీబి) జిల్లా కేంద్రలోని ఆసుపత్రులు.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, హైదరాబాద్, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్ (బాదేపల్లి), ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి (మహేశ్వరం) సూర్యాపేట, పెద్దపల్లి, వికారాబాద్, వరంగల్ (నర్సంపేట) జిల్లాలు ఉన్నాయి.
Read Also: Asian Games 2023: ఆసియా క్రీడల్లో పతకాల జోరు.. 60కి చేరిన భారత్ పతకాల సంఖ్య
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ లో పాల్గొనే బీజేపీ ఇందూరు సభకు 2500 మంది పోలీసులతో భారీ భద్రత కొనసాగుతుంది. ఐజీ, డీఐజీతో పాటు 5గురు ఎస్పీలు, ఇద్దరు బెటాలియన్ కామాండెంట్లు, 13 మంది అదనపు ఎస్పీలు, 13 మంది ఏసీపీలు, 107మంది సీఐలు, 200 మంది ఎస్ఐలు 1900 మంది ఏఎస్ఐల నుంచి కానిస్టేబుల్లు ఇలా దాదాపు 2500 మందికి పైగా డ్యూటీ చేస్తున్నారు.