Lecturer made a student pregnant in Nizamabad: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ గాడీ తప్పాడు. క్లాసులు చెప్పాల్సిన లెక్చరర్ ప్రేమ పాఠాలు చెప్పాడు. యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. తరువాత అతడి గురించి విస్తుపోయే నిజాలు తెలియడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. ఈ ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఓ విద్యార్థిని కార్పొరేట్ కళాశాలలో కోచింగ్ కోసం జాయిన్ అయ్యింది. ఆ యువతిని కాలేజీలో చేర్పించేటప్పుడు తమ బిడ్డ గొప్పదవుతుందంటూ ఆమె తల్లిదండ్రులు కలలు కన్నారు. అయితే తల్లిదండ్రులు కలలు కన్నట్టు ఆ పిల్ల గొప్పది కాదు గర్భవతి అయ్యింది. అయితే దీనంతటికి కారణం ఆమెకు పాఠాలు చెప్పే ఫిజిక్ లెక్చరర్ సైదులు.
Also Read: Ola Electric IPO: ఐపీవోకు ఓలా ఎలక్ట్రిక్ సన్నాహాలు.. అక్టోబర్లో డ్రాఫ్ట్ పేపర్ దాఖలు చేయనున్న కంపెనీ
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన అతడు ఓ యువతికి మాత్రం ప్రేమ పాఠాలు చెప్పాడు. గురువు అంటే తండ్రితో సమానం అలాంటి వాడే గాడీ తప్పి విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఆమెను గర్భవతిని చేశాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అతడికి ముందే పెళ్లై పోయింది. కానీ ఆ విషయాన్ని ఆ యువతికి చెప్పకుండా ఆమెను ప్రేమలోకి దింపి గర్భవతిని చేశాడు. సైదులు పెళ్లి విషయం బయట పడటంతో మోసపోయానని గమనించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.దీంతో పోలీసులు ఫిజిక్స్ లెక్చరర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.