నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజీ మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 3న నిజామాబాద్ జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు అని తెలిపారు. 8 వందల మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ కు ఆయన వర్చువల్ గా ప్రారంభోత్సవం చేయనున్నారు. లక్ష మందితో సభ నిర్వహిస్తున్నాం.. ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర వహించబోతుంది.. ఖమ్మంలో కూడా పార్టీ బలపడింది.. మోడీ పర్యటన రాష్ట్ర రాజకీయాలకు దిశా నిర్దేశంగా ఉండబోతుంది అని ఆయన అన్నారు.
Read Also: Srikanth- Raasi: ఎంత చూడముచ్చటగా ఉన్నారో.. వైరల్ గా మారిన వీడియో
ప్రధాని మోడీ పర్యటన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలు కూడా ఉంటాయని కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మంత్రి కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం మాకు లేదు అని ఆయన తెలిపారు. కేటీఆర్ షాడో సీఎం.. తెలంగాణ కేటీఆర్ జాగీరా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం 17 సార్లు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వక పోవడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ ఎజెండాలో మేము పడబోము అన్నారు.
Read Also: iPhone 15 for free: ఉచితంగా iPhone 15.. నమ్మితే బుక్కవుతారు జాగ్రత్త!
ఎమ్మెల్సీ అభ్యర్థు తిరస్కరణపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయం సరైనదే అంటూ కిషన్ రెడ్డి అన్నారు. అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటు.. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని ఆయన తెలిపారు. నేను అన్ ఫిట్ అంటూ కేటీఆర్ ఇచ్చిన సర్టిఫికేట్ నాకొద్దు అంటూ ఆయన తెలిపారు. నేను ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు.. వారి ఇచ్చే సర్టిఫికేట్ మాత్రమే కావాలి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.