వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. శ్రీలంక క్రికెట్ ప్రకటించిన షెడ్యూల్‌లో మొదటి టెస్ట్ 6 రోజుల్లో ఆడనున్నట్లు ఉంది. సాధారణంగా ఒక టెస్ట్ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరుగుతుంది. కానీ.. ఈ టెస్ట్ మ్యాచ్ ఆరు రోజులు జరగనుంది. అందుకు కారణమేంటంటే.. గాలెలో జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ సమయంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
ICC World Test Championship: భారత క్రికెట్ జట్టు ఇటీవల శ్రీలంకలో పర్యటించింది. అక్కడ మూడు ODIలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడింది. టీ20 సిరీస్‌లో భారత్ 3-0తో శ్రీలంకను వైట్‌వాష్ చేసింది. శ్రీలంక జట్టు వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంక టూర్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లకు దాదాపు 43 రోజుల విరామం లభించింది. విరామం తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.…
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 5 నుంచి 10 వరకు రాష్ట్రపతి ఆయా దేశాలను సందర్శించనున్నారు. ఆగస్టు 5-10 మధ్య ఫిజీ, న్యూజిలాండ్, తైమూర్-లెస్టేలో ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు.
బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ మధ్య తగాదాల గురించి మీరు చాలా కథలు విన్నారు, కానీ న్యూజిలాండ్‌లోని ఒక మహిళ ఈ వివాదాన్ని వేరే స్థాయికి తీసుకువెళ్లింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ప్రేమికుడిపై కేసు పెట్టింది.
Kane Williamson Leave New Zealand Captaincy: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీ వదిలేసిన కేన్.. వన్డే, టీ20 సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అంతేకాదు 2024-25 సీజన్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా తిరస్కరించాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. టీ20 ప్రపంచకప్ 2024లో కివీస్ ఘోర వైఫల్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో…
New Zealand : న్యూజిలాండ్‌లో భారీ విమాన ప్రమాదం తప్పింది. సోమవారం ప్రయాణీకుల విమానం టేకాఫ్ అయిన వెంటనే పక్షిని ఢీకొట్టింది. ఆ తర్వాత విమానంలో మంటలు చెలరేగడంతో ఇంజిన్ ఆగిపోయింది.
T20 World Cup 2026: ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్‌లో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 తరువాత జరగబోయే 2026 ఎడిషన్ కి ఎంతో కీలకం. దీనికి భారతదేశం, శ్రీలంక సహ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ వరల్డ్ కప్ లో మొదటి రౌండ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంకలు నిష్క్రమించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ చివరి నిమిషంలో సూపర్ 8 దశకు చేరుకుంది. 2024 టి 20 ప్రపంచ కప్ సూపర్ 8 దశ తదుపరి రౌండ్…
Afghanistan Enters T20 World Cup 2024 Super 8: టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. శుక్రవారం పాపువా న్యూగినీతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సూపర్ 8కు దూసుకెళ్లింది. గ్రూప్-సీలో ఉన్న అఫ్గాన్.. ఆడిన మూడింట్లో గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచింది. మూడు మ్యాచ్‌లలో గెలిచిన వెస్టిండీస్ కూడా ఇప్పటికే సూపర్ 8కు దూసుకెళ్లింది. దాంతో గ్రూప్-సీలో ఉన్న న్యూజిలాండ్ అధికారికంగా ఎలిమినేట్ అయింది. టీ20 ప్రపంచకప్ 2024…
టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. గ్రూప్- సీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్.. నిర్ణత 20 ఓవర్లలో 159 రన్స్ చేయగా, ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ టీమ్ 15.2 ఓవర్లలో మొత్తం జట్టు 75 పరుగులకే ఆలౌట్ అయింది.