పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 16/1 పరుగులతో ఉంది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (6*), శుభ్‌మన్ గిల్ (10*) ఉన్నారు. కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 243 పరుగుల ఆధిక్యంలో ఉంది.
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. కాగా.. 259 పరుగులకు కివీస్ ఆలౌటైంది. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 7 వికెట్లు తీసి.. న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.
బెంగళూరులో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి.. జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ రెండో టెస్టుకు సైతం దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ఉదయం ఓ ప్రకటలో తెలిపింది. గజ్జల్లో గాయం కారణంగా పూణేలో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు కేన్ అందుబాటులో ఉండడు అని పేర్కొంది. గాయం కారణంగా కేన్ మామ బెంగళూరు టెస్ట్ ఆడని విషయం తెలిసిందే.…
Hug Time: న్యూజిలాండ్‌లోని డునెడిన్ విమానాశ్రయంలో డ్రాప్-ఆఫ్ జోన్‌లో వీడ్కోలు కౌగిలింతలపై సమయ పరిమితిని ప్రవేశపెట్టింది. ఇది తుది ఆలింగనానికి కేవలం మూడు నిమిషాల సమయాన్ని మాత్రమే అనుమతిస్తుంది. విమానాశ్రయం వద్ద ఒక సైన్‌బోర్డులో “గరిష్టంగా కౌగిలించుకునే సమయం 3 నిమిషాలు అని, ఇష్టపడే వీడ్కోలు కోసం దయచేసి కార్ పార్క్‌ని ఉపయోగించండి” అని సూచిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చలకు దారి తీస్తోంది. Read Also: Khalistani Terrorist: నవంబర్ 19…
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కివీస్‌తో జరిగే రెండో, మూడో టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును ప్రకటించింది. ఇందులో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించింది.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. న్యూజిలాండ్ 107 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా సాధించింది. దీంతో.. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది. గెలుపు అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టాస్ ఓడిపోవడం వల్లే భారత్‌తో తొలి టెస్ట్‌లో విజయం సాధించామని అన్నాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని తెలిపాడు.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో తొలి మ్యాచ్ జరుగుతోంది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ మధ్య 177 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో.. భారత జట్టు మొదటి టెస్ట్ నాలుగో రోజు మ్యాచ్‌పై పట్టు బిగించింది. అయితే న్యూజిలాండ్ బౌలర్లు 54 పరుగులకు ఏడు వికెట్లు తీసి అద్భుతంగా పునరాగమనం చేశారు.
3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. భారత్-న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. తొలి టెస్టులో భారత్ ఎదురొడ్డుతుంది. కాగా.. నేడు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ 125 పరుగుల వెనుకంజలో ఉంది.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం బెంగళూరులో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం రవీంద్ర జడేజా వేసిన 37వ ఓవర్లో రిషబ్ పంత్ కాలికి గాయం అయ్యింది.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం బెంగళూరులో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆడుతోంది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌట్ అయింది.