Girl drags Boyfriend to Court: బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ మధ్య తగాదాల గురించి మీరు చాలా కథలు విన్నారు, కానీ న్యూజిలాండ్‌లోని ఒక మహిళ ఈ వివాదాన్ని వేరే స్థాయికి తీసుకువెళ్లింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ప్రేమికుడిపై కేసు పెట్టింది. అసలేం జరిగిందంటే.. వాగ్దానం చేసినట్లుగా ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆమెను ఎయిర్‌పోర్ట్‌లో దింపలేదు, దాని వల్ల ఆమె తన ఫ్లైట్ మిస్ అయింది. ఆ మహిళ కచేరీకి వెళ్లాల్సి ఉంది. దీంతో ఆ మహిళ తన ప్రియుడికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని అతడిపై కేసు పెట్టింది.
Read Also: Fishermen Arrest: 22 మంది భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసిన శ్రీలంక..
కోర్టులో ప్రియురాలు ఏం చెప్పింది?
తన బాయ్‌ఫ్రెండ్‌తో ఆరున్నరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, తనకు వివాదం ఉందని ఆ మహిళ కోర్టుకు తెలిపింది. తన స్నేహితులతో కలిసి సంగీత కచేరీకి వెళ్తున్నట్లు కోర్టుకు తెలిపింది. ఆమెను ఎయిర్‌పోర్టులో దించి, ఆమె లేనప్పుడు తన రెండు కుక్కలను, ఇంటిని చూసుకుంటానని ఆమె ప్రియుడు వాగ్దానం చేశాడు. ప్రయాణానికి ఒక రోజు ముందు ఆమె అతన్ని సమయానికి రావాలని కోరింది. కానీ అతను సమయానికి రాకపోవడంతో ఆమె తన ఫ్లైట్ మిస్ అయింది. దీని తర్వాత మరుసటి రోజు టిక్కెట్టు బుక్ చేసుకున్నానని, దీంతో తనకు చాలా డబ్బు ఖర్చయిందని మహిళ చెప్పింది. తన బాయ్‌ఫ్రెండ్ నుంచి డబ్బును తిరిగి పొందేలా ఆదేశించాలని ఆ మహిళ కోర్టును కోరింది. అయితే ఇద్దరి మధ్య చట్టపరంగా ఎటువంటి సంబంధం లేదని కోర్టు ఆమె డిమాండ్‌ను తిరస్కరించింది. ముఖ్యంగా సంబంధం చట్టబద్ధంగా లేనప్పుడు అలాంటి వాగ్దానాలను నెరవేర్చాలని మీరు ఎవరిపైనా ఒత్తిడి తేలేరని కోర్టు పేర్కొంది.