Sri Lanka vs New Zealand: శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య గాలేలో జారుతున్న మొదటి టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 68 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టు విజయానికి ఇంకా 68 పరుగులు చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ తరఫున రచిన్ రవీంద్ర 158 బంతుల్లో 91 పరుగులతో, అజాజ్ పటేల్ 0 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. నేడు (సెప్టెంబర్ 23)న ఐదవరోజును కొనసాగించగా న్యూజిలాండ్ కేవలం 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా శ్రీలంక 63 పరుగులతో విజయం సాధించింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన ప్రభాత్ జయసూరియకు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ప్రభాత్ జయసూరియ మొదటి ఇన్నింగ్స్ లో 4/136 , రెండో ఇన్నింగ్స్ లో 5/68 అద్భుత ప్రదర్శనతో శ్రీలంకకు విజయాన్ని అందించాడు. ఇక ఇదే స్టేడియంలోనే 26న రెండో టెస్ట్ మొదలు కానుంది.
Afghanistan vs South Africa: ఎట్టకేలకు విజయాన్ని అందుకున్న దక్షిణాఫ్రికా!
ఇక ఈ టెస్ట్ లో రచిన్ రవీంద్ర అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించిన కూడా కివీస్ జట్టు 63 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రచిన్ రవీంద్ర 168 బంతుల్లో 92 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ప్రభాత్ జయసూర్య రచిన్ రవీంద్రను అవుట్ చేయడంతో మ్యాచ్ మొత్తం శ్రీలంక వైపుకు మారింది. రచిన్ రవీంద్ర మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌లు నిరాశపరిచారు. ఓపెనర్ టామ్ లాథమ్ 28 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్ 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. 7 మంది న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు.
Prabath Jayasuriya’s five-wicket haul scripts a memorable Sri Lanka win over New Zealand 👏
🇱🇰 go up 1-0 in the series 🔥#WTC25 | #SLvNZ 📝: https://t.co/PHqmvlAFRP pic.twitter.com/xGbPuc7B7l
— ICC (@ICC) September 23, 2024